Begin typing your search above and press return to search.
రాశీఖన్నాలో భార్య యాంగిల్ చెప్పిన సాయి
By: Tupaki Desk | 12 Jun 2016 4:51 AM GMTఅదేంటో రెండు సినిమాలు వరుసగా చేస్తే చాలు.. ఆ హీరోయిన్ తో లింకు పెట్టేస్తున్నారు. గతంలో చిరంజీవి.. బాలకృష్ణ.. నాగార్జున.. వెంకటేశ్ లాంటి హీరోలు వరుసగా ఒకే హీరోయిన్ తో సినిమాలు చేసినా ఇలాంటి రూమర్లు పుట్టేవి కాదు. కానీ.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా ఉందంటూ వాపోతున్నాడు మెగా క్యాంప్ ఎనర్జీ హీరో సాయి థరమ్ తేజ. అతగాడికి..రెజీనాకు లింకేసిన వార్తలు ఈ మధ్యన సోషల్ మీడియాలో వరుసగా వస్తున్న వేళ.. ఒక అగ్ర పత్రికకు సుప్రీం జంట రాశీఖన్నా.. సాయి కలిసి ఇంటర్వ్యూ ఇచ్చేశారు. వారి మాటల్లో రెజీనా మాటలు రావటం గమనార్హం.
తమ మధ్యన ఉన్నది ప్యూర్ ఫ్రెండ్ షిప్ అని తేల్చేసిన ఈ ఇద్దరి ఇంటర్వ్యూలో రాశీఖన్నా గురించి సాయి ధరమ్ తేజ చెప్పిన మాటలు ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పొచ్చు. అతగాడి ఆన్సర్ కు తగ్గట్లే రాశీఖన్నా మాటలు ఉన్నట్లుగా అనిపించిన ఈ ఇంటర్వ్యూలో సాయి మాటల్లోని కొన్ని ఆసక్తికరమైన మాటల్ని చూస్తే..
= రాశి మంచి ఫ్రెండ్. అయితే.. నా మిగతా ఫ్రెండ్స్ తో ఉన్నంత చనువుగా తనతో ఉండలేను. ప్రొఫెషనల్ గా ఒకే సెట్ లో ఉన్నప్పుడు తను మంచి ఫ్రెండ్ అని మాత్రం పక్కాగా చెప్పగలను. నా చిన్నప్పటి ఫ్రెండ్స్ ఇప్పటికి కంటిన్యూ అవుతున్నారు. నా ఫ్రెండ్స్ లో అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్లలో ఒక అమ్మాయికి పెళ్లి కూడా అయ్యింది. అంతా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కావటంతో మా మధ్యన కంఫర్ట్ లెవలె బాగుంటుంది. రాశీతో అది కుదరకపోవచ్చు.
= తర్వాత ఏ ప్రాజెక్టు చేయాలన్న ఆలోచనలతో ఒక్కోసారి డల్ అయ్యేవాడ్ని. అప్పుడు రాశీ కలుగజేసుకొని.. ‘ఎందుకంత కంగారు పడుతున్నావ్? కూల్ గా ఉండు?’ అంటూ ధైర్యం చెప్పేది. ఫ్రెండ్ గా మంచి సపోర్టింగ్ గా ఉంటుంది. రాశీ చాలా బాగా సర్దుకుపోయే అమ్మాయి. ఓపిక ఎక్కువ. ఏదైనా సీన్ కొంచెం ఇబ్బంది అనిపించినప్పుడు ముందు ఊహు అన్నా.. తర్వాత మాత్రం అడ్జస్ట్ అయ్యేది. అలాంటి నేచర్ ఉన్న అమ్మాయి మంచి భార్యే అవుతుంది.
= రాశీ లాంటి లక్షణాలున్న అమ్మాయి భార్యగా రావాలనుకోవటం వేరు. ఈ అమ్మాయే కావాలనుకోవటం వేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రెండు విషయాల గురించి ఆలోచించటం లేదు. అంత వయసు కూడా నాకు లేదు. నా వయసు ఇప్పుడు జస్ట్ పంతొమ్మిదేళ్లేగా (నవ్వేస్తూ).
= రెజీనా విషయం నిజం కాదండి. వరుసగా రెండు సినిమాలు చేస్తే ఏదో ఉన్నట్లేనా?రాసేవాళ్లను మనం ఆపలేం.. నిజంగానే లవ్ లో ఉండే నేనా విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పేస్తా. రాశిలో నచ్చని గుణం ఏదైనా ఉందంటే.. తను ఎక్కువగా నవ్వటం.. కాసేపు బుద్ధిగా ఉన్నా.. ఎప్పుడూ నవ్వి చంపేస్తుంది. ఆ విషయం వాళ్ల పేరెంట్స్ తో కూడా చెప్పా