Begin typing your search above and press return to search.

ఈ టూర్లు ఎందుకు తేజు?

By:  Tupaki Desk   |   17 Jun 2018 9:35 AM GMT
ఈ టూర్లు ఎందుకు తేజు?
X
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కెరీర్ విషయంలోనే కాదు ప్రమోషన్ లో కూడా అయోమయంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే తేజ్ ఐ లవ్ యు విడుదల జూన్ 29 నుంచి జులై 6కు షిఫ్ట్ చేయటం పలు అనుమానాలకు అవకాశం ఇచ్చింది. ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగకపోవడం వల్లే నిర్మాత కెఎస్ రామారావు తప్పని పరిస్థితుల్లో వారం రోజులు వాయిదా వేసారని గతంలో ఉన్న టాక్ కు బలం ఇచ్చేసారు. దానికి తోడు ప్రమోషన్ విషయంలో వేస్తున్న తప్పటడుగులు కూడా ఫలితాన్ని ఇచ్చేలా లేవు. నిన్న విజయవాడలో గ్రాండ్ ఆడియో సక్సెస్ మీట్ అని కాస్త హడావిడి చేసిన తేజ్ ఐ లవ్ యు టీమ్ తమ అసలు టార్గెట్ అయిన యూత్ ని వదిలేసి గుళ్ళు గోపురాలు చుట్టూ తిరుగుతూ విలువైన కాలాన్ని వృధా చేస్తోందన్న కామెంట్స్ ఇప్పటికే జోరందుకున్నాయి. అసలే బజ్ లేదు. పైగా ముందు వెనుక వారాలు విపరీతమైన పోటీ ఉంది. ఇలాంటి టైంలో వస్తున్న తేజ్ ఐ లవ్ యుకి ఇంత చప్పగా ప్రమోషన్స్ చేయటం మెగా ఫాన్స్ ని కలవరపెడుతోంది. మెగా కాంపౌండ్ నుంచి రంగస్థలం తర్వాత వస్తున్న సినిమా ఇంత లో ప్రొఫైల్ తో రావడం ఖంగారు కలిగిస్తోంది.

నిజానికి తేజు ట్రాక్ రికార్డు బిజినెస్ మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. నిర్మాత చెప్పిన రేట్లకు కొనాలంటే బయ్యర్లు ససేమిరా అంటున్నారు. చాలా చాలా బాగుంది అనే టాక్ వస్తే తప్ప నిలిచే అవకాశాలు లేని పరిస్థితిలో రిస్క్ తీసుకుని భారీ పెట్టుబడులు పెట్టలేమని ఇంటెలిజెంట్ ఫలితాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. అందుకే తేజ్ అండ్ టీమ్ ఈ ఇరవై రోజులు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్ ని స్పీడప్ చేయటం కోసం రకరకాల ప్లాన్స్ వేస్తున్నారు. కానీ హైప్ అమాంతం పెరగడం మాత్రం ఈజీ కాదు. తేజు ఫాలో అవుతున్న పబ్లిసిటీ స్ట్రాటజీ మొత్తానికి మోసం తెచ్చేలా ఉండటంతో మెగా ఫాన్స్ టెన్షన్ పెరిగిపోతోంది. అజ్ఞాతవాసి తర్వాత తొలిప్రేమ-రంగస్థలం వరుస సక్సెస్ లతో ఫుల్ జోష్ లో మెగా ఫాన్స్ కు తేజ్ ఐ లవ్ యు ఎక్కడ చెక్ పెడుతుందో అన్న భయాలు లేకపోలేదు. మరి 20 రోజులే మిగిలిన నేపథ్యంలో తేజ్ ఐ లవ్ యు కు ఊపు రావడం ఎలానో ఎవరికీ అంతు చిక్కడం లేదు.