Begin typing your search above and press return to search.
రెండు మెగా సినిమాలు.. 4.05 కోట్లు
By: Tupaki Desk | 17 Aug 2016 5:08 AM GMTఇప్పడు ఓవర్సీస్ రిలీజ్ రైట్స్ అంటే ఏ సినిమాకైనా కూడా హాటు కేకుల్లా మారిపోతున్నాయి. కాని అన్ని సినిమాలూ అక్కడ ఆడనే ఆడట్లేదు. చాలామంది స్టార్ హీరోలు సైతం ఇంకా అక్కడ ఖాతానే తెరవలేదు. అయినా కూడా కొంతమంది యంగ్ హీరోల సినిమాలకు మాంచి పేమెంట్లే వస్తున్నాయి. కొన్నవారు అమ్మినవారు లాభపడేలా ఉన్నాయి.
నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఇప్పుడు వరుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల డైరక్షన్లో ''మిష్టర్'' సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి - హెబ్బా పటేల్ హీరోయిన్స్. ఆల్రెడీ స్పెయిన్ లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే మంగుళూరు షెడ్యూల్ మొదలెట్టనుంది. ఇకపోతే ఇంకా సెట్స్ మీదకు వెళ్లని.. సాయిధరమ్ తేజ్ అండ్ గోపిచంద్ మలినేని సినిమాను కూడా ఈయన ప్రొడ్యూస్ చేస్తున్నాడులే. ఈ రెండు 'మెగా' సినిమాల ఓవర్సీస్ రైట్స్ ను ఇప్పుడు బుజ్జి 4.05 కోట్లకు అమ్మేశారని తెలుస్తోంది.
నిజానికి వరుణ్ తేజ్ ఇంకా అమెరికాలో తనకంటూ ప్రత్యేక మార్కెట్ ను క్రియేట్ చేసుకోకపోగా.. శ్రీను వైట్లకు మాత్రం మాంచి మార్కెట్టే ఉంది. ఇక సాయిధరమ్ - మలినేని కూడా అక్కడ ఖాతా అనేదే తెరవలేదు. అయినాసరే 4 కోట్ల షుమారు ఇచ్చారంటే మాంచి రేటు గిట్టినట్లే. అంటే ఒక్కో సినిమాకూ పావు మిలియన్ డాలర్లు వస్తే.. పెట్టిన డబ్బులు వచ్చేస్తాయి మరి.