Begin typing your search above and press return to search.

సాయి ధరమ్.. వరుణ్.. అవసరమా?

By:  Tupaki Desk   |   3 Jan 2018 12:30 PM GMT
సాయి ధరమ్.. వరుణ్.. అవసరమా?
X
టాలీవుడ్ లో ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వడం అనేది చాలా అరుదు. ఒకవేళ రిలీజ్ అయితే సినిమాలా ప్రభావం ఎలా ఉంటుందో చెప్పడం కష్టమే. ఇక మెగా ఫ్యామిలిలో అయితే ఇంతవరకు అలాంటి పరిస్థితి ఏర్పడలేదు. ఏర్పడదు కూడా అని అభిమానుల ఆలోచన. కానీ నెక్స్ట్ మంత్ మాత్రం మెగా ఫైట్ ఉంటుందా అనే అనుమానం కలుగుతోంది. సాయి ధరమ్ తేజ్ - వరుణ్ తేజ్ సినిమాలు ఒకే తేదీన రిలీజ్ కాబోతున్నాయని గట్టిగా టాక్ వినిపిస్తోంది.

ఇద్దరు హీరోలు దాదాపు ఒకేసారి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. అదే విధంగా సమానంగా హిట్స్ అందుకుంటూ వెళుతున్నారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ వివి.వినాయక్ తో ఒక సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు ఫైనల్ గా ఇంటిలిజెంట్ అని ఫిక్స్ చేసి ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలనీ దర్శకనిర్మాతలు డిసైడ్ అయ్యారు. ఇక వరుణ్ తేజ్ తొలిప్రేమ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరి ఆ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

రెండు సినిమాలపై అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే వరుణ్ కూడా లవర్స్ డే ను టార్గెట్ చేస్తూ.. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నాడు. మరి ఇది ఎంతవరకు నిజం అనే విషయం ఇంకా ఫైనల్ కాలేదు కానీ మెగా కుమారుడు అల్లుడు బాక్స్ ఆఫీస్ పై ఫైట్ చేయడానికి సిద్ధమవుతున్నారని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. మరి ఈ తరహాలో పోటీపడటం ఎంతవరకు కరెక్ట్ అనేది వారే డిసైడ్ చేసుకోవాలి.