Begin typing your search above and press return to search.

కంగారు ఒణుకు ఎందుకు మెగా గిగా సోద‌రా?

By:  Tupaki Desk   |   23 Sep 2019 9:03 AM GMT
కంగారు ఒణుకు ఎందుకు మెగా గిగా సోద‌రా?
X
ఒక‌రు కంగారు పుడుతోంద‌న్నారు. ఇంకొక‌రు ఒణుకు పుడుతోంద‌న్నారు.. అస‌లు అంతగా కంగారు ఎందుకు? ఒణుకు ఎందుకు? పైగా మెగా యువ‌హీరోల‌కే ఎందుకీ కంగారు ఒణుకు? తెలియాలంటే డీప్ గా లోతుల్లోకి వెళ్లాలి. త‌ర‌చి త‌ర‌చి చూడాలి.

ఆదివారం సాయంత్రం సైరా ప్రీరిలీజ్ ఈవెంట్ ర‌క‌ర‌కాల ఉద్వేగాల‌కు ఉద్విగ్న‌త‌ల‌కు ఆస్కారం క‌ల్పించింది. అత్యంత భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కిన సైరా ప్ర‌చారం కోసం మెగా హీరోలంతా(బ‌న్ని త‌ప్ప‌) ఒకే వేదిక‌పైకి వ‌చ్చారు. అంతేకాదు చిరు.. ప‌వ‌న్.. చ‌ర‌ణ్ ఎంతో ఎమోష‌న‌ల్ స్పీచ్ లు ఇచ్చారు. ఎవ‌రి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్లు స్పీచ్ ల‌తో అద‌ర‌గొట్టారు. ఎవ‌రి అనుభ‌వం ఎంత అన్న‌ది పూస గుచ్చారు. భారీ చిత్రం కాబ‌ట్టి ఎవ‌రు ఎలాంటి జాగ్ర‌త్త తీసుకున్నారో ఎవ‌రి ఉద్వేగం దేనితో ముడిప‌డి ఉందో ఈవెంట్ సాక్షిగా బ‌య‌ట‌ప‌డింది.

ఈ వేదిక‌పై మావ‌య్య చిరంజీవి ప‌క్క‌నే నించుని సాయిధ‌ర‌మ్ కంగారు ప‌డుతూ స్పీచ్ ఇచ్చాడు. సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ ``ఇంత వర్షం పడుతుంటే కూడా మీ జోష్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇలా స్టేజ్ మీద చిరంజీవి గారి ముందు - కళ్యాణ్ గారి ముందు మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది అలాగే కంగారుగా కూడా ఉంది`` అని అన్నారు. చరణ్ ఇది మీ ఫాదర్ డ్రీమ్ మాత్రమే కాదు.. మా అందరి డ్రీమ్ ని నిజం చేశావు. సైరా ట్రైలర్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అని అన్నారు సుప్రీంహీరో. అలాగే మెగా ఫ్యాన్స్ అందిరికీ నమస్కారించారు.

ఇదే వేదిక‌పై మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. మెగాస్టార్- పవర్ స్టార్- మెగా పవర్ స్టార్ వీళ్లందరి ముందు మాట్లాడాలంటే ఒణుకు వస్తోంది. మెగాస్టార్ 152 సినిమాలు చేసినా ఇలాంటి సినిమాలు చేయలేదు. చరణ్ లాంటి కొడుకు ఉన్నందుకు నాన్నగారు గర్వపడుతుంటారు. అలాంటి అన్న ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. ఈ సినిమా ప్రతీ భారతీయుడు గర్వపడే సినిమా అవుతుంది అని ఉద్వ‌గంగానే స్పీచ్ ని ఇచ్చారు వ‌రుణ్. ఆ ఇద్దరు మెగా యువ‌హీరోలు కంగారు ఒణుకు అని సంబోధించ‌డానికి కార‌ణం మెగాస్టార్ - ప‌వ‌ర్ స్టార్ వంటి దిగ్గ‌జాలు వేదిక‌పై ఉండ‌డ‌మేన‌ని ఫ్యాన్స్ కి అర్థ‌మైంది.