Begin typing your search above and press return to search.
మెగా హీరో ప్రకటించేశాడు.. మరో మిగతా వారి సంగతేంటి..?
By: Tupaki Desk | 19 Nov 2020 5:10 PM GMTకరోనా కారణంగా గత కొన్ని నెలలుగా మూతబడిన థియేటర్స్ ఇప్పుడిప్పుడే రీ ఓపెన్ చేస్తున్నారు. తమిళనాడులో దీపావళి సందర్భంగా కొన్ని సినిమాలను థియేట్రికల్ రిలీజ్ చేశారు. అయితే తెలుగు సినిమాల థియేట్రికల్ రిలీజ్ విషయంలో మాత్రం మేకర్స్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమాలు.. చివరి దశలో ఉన్న సినిమాలు సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటిస్తున్నారు కానీ.. ఈ గ్యాప్ లో థియేటర్స్ లో తమ సినిమా రిలీజ్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రాన్ని డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.
సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించాడు. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం సమకూర్చాడు. ఈ సినిమా రైట్స్ జీ స్టూడియోస్ వారు సొంతం చేసుకున్నారు. ఇన్నాళ్లు థియేట్రికల్ రిలీజ్ లేదా డిజిటల్ రిలీజ్ అనే దానిపై డైలామాలో ఉన్న మేకర్స్ ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ కే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో తేజ్ తరువాత డిజిటల్ రిలీజ్ కోసం ప్రయత్నాలు చేసిన సినిమాలు.. లాక్ డౌన్ కి ముందే కంప్లీట్ అయి థియేట్రికల్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న సినిమాలు ఇప్పుడు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని సినీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అలానే ఇప్పటికే ఓటీటీ బాట పట్టిన మీడియం రేంజ్ సినిమాలు కూడా మళ్లీ థియేటర్ లోకి వస్తాయేమో చూడాలి.