Begin typing your search above and press return to search.
మరో మెగా రీమిక్స్ తో సుప్రీమ్ హీరో!
By: Tupaki Desk | 11 Oct 2015 7:30 AM GMTఅవకాశం ఉంది కదా అని ఏది పడితే అది వాడేయకూడదు. వాడకానికి కూడా సమయం, సందర్భం కలిసి రావాలి. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కి మాత్రం అవన్నీ భలే కలిసొస్తున్నాయి. పాత సినిమాల్లోని పాటల వాడకంలో మనోడు ముందున్నాడు. తన మావయ్యల సినిమాల్లోని పాటల్ని వాడుకొంటూ తన సినిమాలకి క్రేజ్ పెంచుకొంటున్నాడు. మొదట 'రేయ్' సినిమా కోసం 'గోలీమార్' - 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' కోసం 'గువ్వా గోరింకతో ..' పాటలను రీమిక్స్ చేసి ఆడియన్స్ ను అలరించాడు. అత్తారింటికి దారేదిలోని పిల్లా నువ్వు లేని జీవితం... అనే పాట పల్లవిని తీసుకొని ఏకంగా తన సినిమాకి పేరుగా వాడుకొన్నాడు. ఇప్పుడు మరో రీమిక్స్ కు రెడీ అవుతున్నట్టు
తెలుస్తోంది.
సాయిధరమ్ తేజ్ - రాశిఖన్నా జంటగా సుప్రీమ్ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. పటాస్ ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో 'యముడికి మొగుడు` సినిమాలోని సుప్రీమ్ హీరో... అంటూ సాగే పాటను రీమిక్స్ చేయాలనే ఆలోచనలో వున్నారని తెలుస్తోంది. మెగా స్టార్ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని అంటున్నారు. మెగా స్టార్ నటించిన 150 సినిమాల్లో ఏ పాటనైనా - ఏ డైలాగ్‌నైనా ఆ కుటుంబ కథానాయకులు వాడుకోవచ్చు. అందుకు ఎవ్వరూ అభ్యంతరం చెప్పరు. కాకపోతే అలా వాడుకోవడానికి కూడా ఓ ప్రత్యేకమైన సందర్భం ఉండాలి. ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా వాడేయకూడదు. చరణ్ - సాయిదరమ్ తేజ్ మెగాస్టార్ సినిమాల్లోని పాటల్ని రీమిక్స్ చేసి వినిపించారు. అయితే ఎప్పుడూ ఆ పాటలు ఫెయిలవ్వలేదు.
అందుకే చిరంజీవి కూడా తన సినిమాల్లో పాటలు వాడుకొంటామని చెప్పగానే ఆనందంగా ఓకే చెప్పేస్తున్నాడు. సో... మరోసారి అందం హిందీళం అంటూ బ్రేక్ డ్యాన్ప్ వేసి సాయిధరమ్ తేజ్ అదరగొడతాడన్నమాట.