Begin typing your search above and press return to search.

తిక్క హీరోయిన్ ను డేట్ కు రమ్మంటే..

By:  Tupaki Desk   |   29 Nov 2017 4:21 AM GMT
తిక్క హీరోయిన్ ను డేట్ కు రమ్మంటే..
X
సాయి ధరమ్ తేజ్ అంటే టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లో ఒకడు. మెగా ఫ్యామిలీలోని హీరో. అంతటివాడు కోరి డేట్ కు రమ్మని అడిగితే.. వీలైనంత వరకు నో చెప్పరు. ఇటు ఎస్ అని.. అటు నో అని కాకుండా కాస్తంత తిక్కగా సమాధానమిస్తే.. ఆమె కచ్చితంగా తిక్క భామే.

సాయి ధరమ్ లేటెస్ట్ గా నటించిన జవాన్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా ఓ టీవీ ఛానల్ కు వెళ్లిన అతడికి ఓ ప్రశ్న ఎదురైంది ‘ఎవరైనా హీరోయిన్ డేట్ కు వెళ్దామని ప్రపోజ్ చేసిందా అని’? తనకు ఎప్పుడూ అలాంటి ప్రపోజల్ రాలేదని జవాబిస్తూ తాను డేట్ కు రమ్మని ఓ హీరోయిన్ ను అడిగానని తేజూ చెప్పుకొచ్చాడు. ‘‘తిక్క సినిమా హీరోయిన్ లారిస్సా బొనేస్సిని డేట్ కు వెళ్దామా అని అడిగా.. దానికి ఆమె అందుకు తన బాయ్ ఫ్రెండ్ ను అడగాలంటూ కౌంటర్ వేసిందని’’ గుర్తు చేసుకున్నాడు.

సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన తిక్క సినిమాలో బ్రెజిల్ భామ లారిస్సా బొనేసి ఓ హీరోయిన్ గా నటించింది. లాస్ట్ ఇయర్ వచ్చిన ఈ సినిమా ఇలా వచ్చేసి వారం రోజుల్లోనే థియేటర్ల నుంచి వెళ్లిపోయింది. సినిమా చూసిన జనాలకు కాస్తోకూస్తో గుర్తుండేది చూడగానే ఆకట్టుకునే లారిస్సాయే. మొత్తానికి అమ్మడి అందం ప్రేక్షకుల గుండెల్నే కాదు.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గుండెను కూడా కదిలించిందన్న మాట. సుందరాంగి డేట్ కు రాకపోయినా ఇప్పటికి తనకు మంచి ఫ్రెండ్ అని అంటున్నాడు సాయిధరమ్.