Begin typing your search above and press return to search.
సాయిధరమ్ తేజ్ బైక్ ప్రమాదంపై పోలీసుల ప్రకటన ఇదీ
By: Tupaki Desk | 12 Sep 2021 4:51 AM GMTమెగా హీరో, చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు అపోలో ఆస్పత్రి వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే సాయితేజ్ బైక్ ప్రమాదంపై మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు అధికారికంగా స్పందించారు. ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ కు గురైన బైక్ సెకండ్ హ్యాండ్ బైక్ అని డీసీపీ తెలిపారు. వేరే వ్యక్తి నుంచి కొనుగోలు చేశారని తెలిపారు. ఎల్బీ నగర్ కు చెందిన అనిల్ కుమార్ అనే వ్యక్తి నుంచి తేజ్ ఈ బైక్ ను కొన్నాడని వివరించారు. ఈ సమాచారం మేరకు అనిల్ కుమార్ ను పిలిచి విచారిస్తున్నామని మాదాపూర్ డీసీపీ తెలిపారు.
బైక్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఇంకా పూర్తి కాలేదని.. బైక్ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపామని.. గతంలో మాదాపూర్ లోని పర్వతాపూర్ వద్ద ఓవర్ స్పీడుపై రూ.1135 చలాన్ వేశామని.. ఈ చాలన్ ను ఈరోజు సాయిధరమ్ తేజ్ కుటుంబ సభ్యులు క్లియర్ చేశారని వెల్లడించారు.
ఇక సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాద సమయంలో 78 కి.మీల వేగంతో వెళుతున్నాడని.. దుర్గం చెరువుపై 102 కి.మీల వేగంతో బైక్ నడుపుతున్నారని పోలీసులు నిర్ధారించారు.
ర్యాష్ డ్రైవింగ్ తోపాటు నిర్లక్ష్యంగా బైక్ ను నడిపాడని.. ఆటోను లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్ టేక్ చేయబోయి స్కిడ్ అయ్యి కింద పడ్డాడని డీసీపీ తెలిపారు.
సాయితేజ్ వద్ద టూ వీలర్ నడిపే డ్రైవింగ్ లైసెన్స్ లభ్యం కాలేదని.. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ చేసే లైసెన్స్ మాత్రమే ఉందని.. ప్రమాదం సమయంలో హెల్మెట్ ధరించి ఉన్నాడని డీసీపీ తెలిపారు.