Begin typing your search above and press return to search.

హీరోయిన్ పుట్టినరోజున 'మెగా' జోకేశాడే

By:  Tupaki Desk   |   13 Dec 2016 1:30 PM GMT
హీరోయిన్ పుట్టినరోజున మెగా జోకేశాడే
X
ఈరోజు డస్కీ బ్యూటి రెజీనా కసాండ్రా పుట్టినరోజు. అమ్మడు ప్రస్తుతం తెలుగులో ''నక్షత్రం'' సినిమా తప్పించి ఇంకో మూవీ ఏదీ చేయకపోయినా కూడా.. తెలుగులో మాత్రం పాపులార్టీ బాగానే ఎంజాయ్ చేస్తోంది. పైగా ఆ మధ్యన మెగా హీరో సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు వేడుకల్లో అమ్మడు ఎక్కడలేని సందడి చేసిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఇప్పుడు మెగా మేనల్లుడు కూడా ట్విట్టర్ సాక్షిగా రెజీనాకు విషెస్ చెప్పాలని ఫిక్సయ్యాడు. అందుకే ఒక మెగా జోక్ ను క్రియేట్ చేయించి.. దానినే ట్వీట్ చేశాడు. ఒక కామిక్ స్ర్టిప్ తరహాలో ఒక జోక్ క్రియేట్ చేయించాడు సాయిధరమ్. ''హ్యాపీ బర్త్ డే పాప గారూ'' అని మనోడు అంటుంటే.. ''కెమెరా చూసి కాదురా.. నన్ను చూసి చెప్పు '' అంటోంది పాప. దానితో ఆమెనే చూసి చెబుతుంటే.. ''సీతతో అంత వీజి'' కాదు అంటూ ''సుబ్రమణ్యం ఫర్ సేల్'' సినిమా డైలాగ్ కొట్టేసిందిట అమ్మడు. సుబ్రమణ్యం ఫర్ సేల్.. పిల్లా నువ్వులేని జీవితం వంటి సినిమాలో సాయిధరమ్ అండ్ రెజీనా కలసి నటించిన విషయం తెలిసిందే.

అందుకే ఈ జోక్ కూడా ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ తెగ డిస్కషన్లకు దారితీస్తోంది. మొత్తానికి సీత బర్త్ డే విషెస్ చెప్పకపోతే అంత వీజీగా వదిలిపెట్టదా అంటూ అందరూ గుసగుసలాడుతున్నారు. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/