Begin typing your search above and press return to search.
6 ఫ్లాపుల తర్వాత సాయిధరమ్ తేజ్ పరిస్థితేంటి.?
By: Tupaki Desk | 12 July 2018 4:20 AM GMTమెగా ఫ్యామిలీ నుంచి హీరోగా దూసుకొచ్చిన సాయిధరమ్ మూడు వరుస హిట్స్ తో ఇండస్ట్రీని ఆకర్షించారు. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం సినిమాలతో హీరోగా సాయి నిలదొక్కుకున్నారు. కానీ ఈ మధ్యే బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది.. ‘తిక్క’ సినిమాతో మొదలైన ఫ్లాపుల పరంపర ‘తేజ్.. ఐలవ్ యూ’ వరకూ కొనసాగింది. వరుస ఫ్లాపులతో సాయిధరమ్ తేజ్ ఇప్పుడు చాలా నేర్చుకున్నాడు. మరోసారి ఇవి పునరావృతం కాకుండా పకడ్బందీగా ముందుకెళ్లాలని డిసైడ్ అయినట్టు సమాచారం.
తాజాగా తను భవిష్యత్తులో చేయబోయే సినిమాల విషయంలో కొత్త రూల్స్ ఫాలో అవ్వాలని సాయిధరమ్ నిర్ణయించుకున్నారు. అందులోభాగంగా రెండు రూల్స్ తప్పక పాటిస్తానని చెబుతున్నాడు.
1) సినిమా స్క్రిప్ట్: గడిచిన రెండున్నర సంవత్సరాలుగా సాయిధరమ్ తేజ్ ఎంచుకున్న కథలన్నీ ఫ్లాప్ అయ్యాయి.. దీంతో ఈసారి చేయబోయే కథలను తనకు బాగా సన్నిహితులైన సీనియర్లకు చూపించిన తర్వాతే ఓకే చేయాలని డిసైడ్ అయ్యాడట..
2) చిరంజీవి రిమేక్ పాటలకు మంగళం : చిరంజీవి మేనల్లుడిగా రంగప్రవేశం చేసిన సాయిధరమ్ తేజ్ ఇప్పటివరకూ తన సినిమాల్లో చిరు హిట్స్ సాంగ్స్ ను రిమేక్ చేస్తున్నాడు. ఫ్యాన్స్ కోసం ఈ ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా ఇంటెలిజెంట్ సినిమాలో చేసిన ఆ ప్రయోగం విఫలమైంది. ఇక నుంచి తన కొత్త సినిమాల్లో చిరు పాటలను రీమేక్ చేయడానికి నో చెప్పబోతున్నాడట తేజ్. తన ముద్ర వేయడానికే ఇదంతా చేయాలని డిసైడ్ అయ్యాడు.
ఇలా సాయిధరమ్ తన కొత్త ప్రాజెక్టుల విషయంలో ఆచీతూచీ వ్యవహరించేందుకు రెడీ అవుతున్నారు. ఇలాగైనా వరుసహిట్స్ అతడిని పలకరిస్తాయని ఆశతో ఉన్నాడు.