Begin typing your search above and press return to search.

రవితేజతో సరితూగలేనన్న మెగా హీరో

By:  Tupaki Desk   |   27 April 2016 11:27 AM IST
రవితేజతో సరితూగలేనన్న మెగా హీరో
X
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సాయి ధరం తేజ్ చాలా సింపుల్ గా ఉంటాడు. మామయ్యల పోలికలతో ఆన్ స్క్రీన్ పై రచ్చ రచ్చ చేసే ఈ మెగా సుప్రీం స్టార్.. ఆఫ్ స్క్రీన్ పై మాత్రం చాలా కూల్. సరదాలు, జోక్స్ లాంటి ఓ లిమిట్ వరకే మెయింటెయిన్ చేస్తాడు. అలాగే.. ఇతరులతో కంపేరిజన్ చేసినప్పుడు కూడా.. సున్నితంగానే తనకు అంత స్థాయి లేదని చెబుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు.

వరుస హిట్స్ కొట్టడం, త్వరలో సుప్రీమ్ అనే టైటిల్ పై సినిమా రిలీజ్ చేస్తున్న టైం కావడంతో.. ప్రస్తుతం తేజుపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇదే ఉత్సాహంతో కొందరు ఫ్యాన్స్ ఓ మెట్టు పైకెక్కేశారు. మాస్ మహరాజా రవితేజ తర్వాత తేజునే అని ఫిక్స్ అయిపోయారు. రవితేజని రీప్లేస్ చేయగలిగేది తేజునే అని తేల్చేశారు. వీళ్లిద్దరినీ కలిపి ఫోటోలు డిజైన్ చేసి మరీ.. కంపేర్ చేసేశారు.

ఇదంతా చూసిన తేజు ఇప్పుడు రియాక్ట్ అయ్యాడు. 'నన్ను రవితేజతో పోల్చినందుతు థ్యాంక్స్. కానీ ఆయన ఎనర్జీ లెవెల్స్ ను నేను ఏ సమయంలోనూ అందుకోలేను' అంటూ మాస్ మహరాజ్ పై గౌరవాన్ని చాటుకున్నాడు సాయిధరం తేజ్. తన సింప్లిసిటీని ఇలా ప్రదర్శించాడు కానీ.. నిజానికి రవితేజతో తేజు కంపేరిజన్ మొదలై చాలాకాలమైంది. ఇండస్ట్రీ జనాలు ఆల్రెడీ దీనికే ఫిక్స్ అయిపోయారు కూడా.