Begin typing your search above and press return to search.
భయపడి మిస్టేక్ చేసిన తేజ్
By: Tupaki Desk | 9 April 2019 4:41 AM GMTఅరడజను ఫ్లాప్ ల తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన 'చిత్రలహరి' చిత్రంపై పెద్దగా అంచనాలుండకూడదు. కాని ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ వారు కిషోర్ తిరుమల దర్శకత్వంలో నిర్మించడంతో పాటు, ఇద్దరు హీరోయిన్స్, సినిమా టీజర్ - ట్రైలర్ లు అన్ని కలిపి చిత్రలహరి సినిమాపై అంచనాలు పెంచేశాయి. తప్పకుండా ఈ చిత్రం తేజూ వరుస ఫ్లాప్ లకు ఫుల్ స్టాప్ పెడుతుందనే నమ్మకంను అంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. హైప్ ఉన్న సినిమాను మంచి డేట్ ను చూసి వదిలితే తప్పకుండా మంచి కలెక్షన్స్ నమోదు అవుతాయి. పోటీ ఉన్నా కూడా మంచి తేదీలో విడుదల అవ్వడం వల్ల వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. కాని చిత్రలహరి చిత్రంను మొదట ఏప్రిల్ 5న విడుదల చేయాలని భావించి ఎన్నికల హడావుడి కారణంగా వాయిదా వేయడం జరిగింది.
'మజిలీ' కూడా ఏప్రిల్ 5న రాబోతున్నట్లుగా ప్రకటన వచ్చిన నేపథ్యంలో చైతూతో పోటీ మరియు ఎన్నికల నేపథ్యంలో భయపడ్డ చిత్ర యూనిట్ సభ్యులు విడుదలకు వెనుకంజ వేశారు. ఎన్నికలు పూర్తి అయిన తర్వాత రోజు సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఎన్నికల ముందు వస్తే సినిమాను పట్టించుకుంటారో లేదో అని చిత్రలహరి టీం భయపడితే తాజాగా విడుదలైన 'మజిలీ' చిత్రం మంచి వసూళ్లను నమోదు చేసింది.
చాలా రోజులుగా మంచి సినిమాలు - పెద్ద సినిమాలు లేని కారణంగా 'మజిలీ' రాగానే జనాలు ఎగబడి చూస్తున్నారు. దాదాపు రెండు నెలలుగా మంచి సినిమాలే కరువయ్యాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ చూడదగ్గ సినిమాలే రాలేదు. దాంతో మజిలీకి మంచి ఛాన్స్ దక్కింది. చిత్రలహరి కూడా ఏప్రిల్ 5న వచ్చి ఉంటే మంచి ఫలితంను దక్కించుకునేది. మజిలీకి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా చిత్రలహరికి కూడా మంచి ఛాన్స్ ఉండేది. ఇప్పటికే మజిలీ వచ్చి పాజిటివ్ టాక్ దక్కించుకున్న నేపథ్యంలో చిత్రలహరి అంతకు మించి ఉంటేనే ప్రేక్షకులు అటు మొగ్గు చూపుతారు. ఇక చిత్రలహరి విడుదలైన వారంకే నాని సినిమా కూడా రాబోతుంది. దాంతో చిత్రలహరి ఏప్రిల్ 5ను మిస్ చేసుకోవడం పెద్ద మిస్టేక్ గా సినీ వర్గాల వారు అంటున్నారు. మరి చిత్రలహరి ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తుందో తెలియాలి అంటే మరో మూడు రోజులుగా ఆగాల్సిందే.