Begin typing your search above and press return to search.

సుప్రీమ్ హీరో జవాన్ ఎలా అయ్యాడు?

By:  Tupaki Desk   |   30 Nov 2017 11:22 AM GMT
సుప్రీమ్ హీరో జవాన్ ఎలా అయ్యాడు?
X
2015లో నేను జవాన్ స్టోరీ విన్నాను - కథ నచ్చింది కానీ నాకు ఈ స్టోరీ సెట్ అవుతుందా అనే డౌట్ పడేసరికే ఏడాది గడిచిపోయింది. ఆ తరువాత మా ప్రొడ్యూసర్ కృష్ణగారు ఈ ప్రాజెక్ట్ ని నిర్మించేందుకు ముందుకురావడంతో నేను జవాన్ గా మారాల్సి వచ్చింది(నవ్వుతూ).

*మెగా కాంపౌండ్ లో ఉన్న ఇతర హీరోలకి సాయిధరమ్ గట్టి పోటీ ఇస్తున్నాడని టాక్ ఉంది - అవునంటారా? కాదంటారా?

మాలో మాకు పోటీ ఉన్నా - మేమంతా కలిసే ఉంటాం. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం - మాలో ఉండే పోటీ కేవలం వెండితెర వరకే పరిమితం. ఇంట్లో మేమంతా సినిమాలు గురించి మాట్లాడేది చాలా తక్కువ. అయినా మీరు పోటీ అని ఎలా అంటారు. నా చివరి రెండు సినిమాలు అనుకున్నంత రేంజ్ లో ఆడలేదు(నవ్వులు). హిట్స్ పడితేనే కదా నేను మా వాళ్లకి పోటీ ఇచ్చేది.

*మీ అభిమానులు కమర్షీయల్ కంటెంట్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు, మరి జవాన్ వంటి మెసెజ్ ఓరియెంటెడ్ మూవీ వారిని ఎంటర్ టైన్ చేస్తుందా?

జవాన్ లో నా అభిమానులుకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి. యాక్షన్ - కామెడీ - రొమాన్స్ - పవర్ ఫుల్ డైలాగ్స్ వీటి అన్నిటితో పాటు ఓ చిన్న మెసేజ్ కూడా ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకి తెలిపే ప్రయత్నం చేశాము. ఓ సోష‌ల్ రెస్పాన్స్ బిలిటి ఉన్న వ్య‌క్తి ఎలా బిహేవ్ చేస్తాడో ఈ సినిమాలో చూపించే ప్ర‌య‌త్నంచాము. ఈ లైన్ ని బేస్ చేసుకునే జ‌వాన్ క‌థ అల్లుకోవ‌డం జ‌రిగింది.

* మీ సినిమాల పై దిల్ రాజుగారు ప్ర‌భావం ఎక్కువుగా ఉంటుంది, ఈ సినిమా కూడా దిల్ రాజుగారు ఆధ్వ‌ర్యంలో విడుద‌ల అవుతోంది. ఎలా సాగుతోంది మీఇద్ద‌రి జ‌ర్నీ?

నేను ఇప్ప‌టివ‌రుకు చేసిన ఎనిమిది సినిమాల్లో నాలుగు సినిమాలు దిల్ రాజుగారే నిర్మించారు - విడుద‌ల చేశారు. ఈ ఒక్క మాటే చాలు క‌దా నాకు ఆయ‌నికి ఉన్న జ‌ర్నీ ఎలా సాగుతోందో అర్ధ‌మ‌వుతోంది. నేను ఎస్ వి సి బ్యాన‌ర్ లో న‌టించిన హీరో అని అనే కంటే దిల్ రాజుగారు ఇంట్లో అబ్బాయి అని పిలిస్తే నాకు చాలా హ్యాపీ. దిల్ రాజుగారే కాదు, శిరీష్ గారు - ల‌క్ష్మణ్ గారు కూడా న‌న్ను వాళ్ల ఇంట్లో అబ్బాయిలానే ట్రీట్ చేస్తారు. నన్ను దిల్ రాజు గారు న‌మ్మ‌డం నా అదృష్టం అనే అనుకోవాలి. అంతేకాదు ఈ సినిమా ప్రొడ్యూస‌ర్ కృష్ణ‌గారు కూడా న‌న్ను బాగా చూసుకున్నారు. న‌న్నే కాదు యూనిట్ మొత్తానికి ఎక్క‌డా ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు. అందుకే సినిమా షెడ్యూల్ ఎప్పుడా అని చాలా మంది టెక్షీషియ‌న్లు అడిగి మ‌రీ తెలుసుకొని షూట్ కి వ‌చ్చిన సంద‌ర్భాలు చాలా ఉన్నాయి.

* మెహ‌రిన్ ఈ మ‌ధ్య వ‌రుస హిట్లు కొడుతోంది ఆమెతో వ‌ర్కింగ్ ఎక్స్ పీరియ‌న్స్ ఎలా ఉంది ?

మెహరిన్ కొట్టిన హిట్స్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. (న‌వ్వులు) జ‌వాన్ సినిమాకి క‌థే గోల్డెన్ లెగ్(న‌వ్వులు). ఇక ఆమెతో వ‌ర్కింగ్ ఎక్స్ పీరీయ‌న్స్ గురించి చెప్పే కంటే త‌ను చాలా హార్డ్ వ‌ర్కింగ్ అని మాత్రం చెప్ప‌గ‌ల‌ను. అలానే ఈ సినిమాను డైరెక్ట్ చేసిన బివిఎస్ ర‌విగారు కూడా చాలా హార్డ్ వ‌ర్క‌ర్ అలానే ఆయ‌న హ్యామ‌ర్ కి సెట్స్ లో బాగా ఎంజాయ్ చేశాను. చెప్పిన క‌థ‌ను అలానే తెర‌కెక్కించడం ర‌విగారికి ఉన్న యూనిక్ టాలెంట్. ఈ సినిమా కోసం ఆయ‌న ఎంచుకున్న పాయింట్ - దాన్ని తెర‌కెక్కించిన తీరు. కావాల్సిన టెక్షీషియ‌న్స్ ని ఎంచుకోవ‌డం. ఇలా ప్ర‌తి విష‌యంలో ర‌విగారు ఓ క్లారిటీతో వ‌ర్క్ చేశారు. అలానే థ‌మ‌న్ ఇచ్చిన ట్యూన్స్ సైతం సినిమాకి పెద్ద ప్ల‌స్ అని చెప్పాలి. మా వ‌రుకు జ‌వాన్ టీమ్ అంతా ప్రేక్ష‌కుల్ని నూటికి నూరు శాతం అల‌రించేందుకు ప్ర‌య‌త్నం చేశాము. ఇక మిగిలింది వారి చేతిలోనే ఉంది.