Begin typing your search above and press return to search.

సుప్రీం హీరోను చేరేందుకు 9 నెలలు పట్టిందట

By:  Tupaki Desk   |   30 Sep 2019 8:58 AM GMT
సుప్రీం హీరోను చేరేందుకు 9 నెలలు పట్టిందట
X
అభిమానులు తమ అభిమాన హీరోలను చేరుకునేందుకు ఎన్ని కష్టాలైనా పడతారు. హీరోలను కలిసి ఒక్క ఫొటో దిగడం కోసం చాలా రోజులు ఎదురు చూస్తారు. అప్పుడప్పుడు తమను అభిమానించే అభిమాని కుటుంబంలో వేడుకలకు హాజరు అవ్వడం లేదంటే వారిని ఇంటికి లేదా ఆఫీస్‌ కు పిలిపించుకుని వారిని ఆనందింపజేయడం చేస్తూ ఉంటారు. మెగా హీరోలు ఎక్కువగా అభిమానులను తమ వద్దకు పిలిపించుకుని వారితో మాట్లాడటం చేస్తూ ఉంటారు.

ఇటీవల మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ తనను కలవాసుకున్న అభిమానిని కలిశాడు. 9 నెలల పాటు ఆ అభిమాని సాయి ధరమ్‌ తేజ్‌ ను కలిసేందుకు ప్రయత్నాలు కొనసాగించాడట. ఎట్టకేలకు ఆయన కష్టం ఫలించింది. ఆ అభిమాని తన బిడ్డకు తేజ్‌ తో పేరు పెట్టించాలని ఆశ పడ్డాడు. అప్పటి నుండి కూడా తేజ్‌ ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అతడి ప్రయత్నాలు తెలుసుకున్న తేజ్‌ కలిసేందుకు అవకాశం ఇచ్చాడు.

ఆ అభిమాని కోరుకున్నట్లుగానే అతడి చిన్నారికి తేజ్‌ పేరు కూడా పెట్టాడు. మెగా ఫ్యామీల ఎక్కువగా తేజ్‌ అంటూ చివర్లో పెట్టుకుంటుంది. తేజ్‌ కలిసి వచ్చేలా తేజన్విత అనే పేరును సాయి ధరమ్‌ తేజ్‌ ఆ పాపకు పెట్టాడు. సాయి ధరమ్‌ తేజ్‌ చిన్నారిని ముద్దు చేస్తూన్న ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈమద్య కాలంలో సాయిధరమ్‌ తేజ్‌ ఇలా మంచి చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటూ సోషల్‌ మీడియాలో బాగా ఫేమస్‌ అవుతున్నాడు.