Begin typing your search above and press return to search.
ఆ హీరో పాత గాయాన్ని కెలికి తిక్కరేగేలా చేస్తున్నారట...!
By: Tupaki Desk | 23 April 2020 11:30 PM GMTప్రతి హీరో సినీ కెరీర్లో కొన్ని సినిమాలు ఎంతో ఇష్టపడి కష్టపడి చేసినప్పటికీ అవి చేదు అనుభవాన్ని మిగులుస్తుంటాయి. కొన్ని సినిమాలు మాత్రం స్టోరీ జడ్జ్ చేయలేక తర్వాత రోజుల్లో 'ఈ సినిమా ఎందుకు చేసాం రా' అని బాధ పడేలా చేస్తుంటాయి. అలాంటి సినిమాలను హీరోలు మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడానికి కూడా ఇష్టపడరు. ఇలాంటి సినిమాలు ప్రతి హీరో కెరీర్లో ఉంటాయి. మన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కెరీర్లో కూడా అలాంటి సినిమా ఒకటుంది. అయితే ఆ సినిమాను సాయి ధరమ్ తేజ్ ఎప్పుడో మర్చిపోయాడు కూడా. కానీ ఈ మధ్య ఒక ఛానల్ తేజ్ మర్చిపోయిన ఆ సినిమాని పదే పదే గుర్తు చేసి ఇబ్బంది పెడుతోందట. వివరాల్లోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సినీ రంగంలోకి ప్రవేశించాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. వైవీఎస్ చౌదరి తెరకెక్కించి 'రేయ్' సినిమాతో ఇంట్రడ్యూస్ అవ్వాల్సి ఉన్నా.. అది అనివార్య కారణాలతో వాయిదా పడడంతో 'పిల్లా నువ్వు లేని జీవితం' ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్ ఆరంభంలో వరుసగా సినిమాలు చేసినా 'సుబ్రమణ్యం ఫర్ సేల్', 'సుప్రీమ్' మాత్రమే హిట్లుగా నిలిచాయి. ఆ తర్వాత కూడా తేజ్ నటించిన చిత్రాల్లో చాలా వరకు పరాజయం పాలయ్యాయి. వరుస పరాజయాలతో సతమతం అవుతున్న తరుణంలో సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి'తో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఓ అరడజను ప్లాపుల తర్వాత 'చిత్రలహరి' చిత్రంతో బయటపడ్డాడు. ఇటీవల మారుతి డైరెక్షన్‌లో వచ్చిన ‘ప్రతిరోజూ పండగే'తో వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో తేజ్ తరువాతి సినిమాల పై కూడా మంచి బజ్ ఏర్పడింది. కెరీర్ కొంచెం గాడిలో పడింది అని ఆనందపడుతున్న తరుణంలో ఓ టీవీ ఛానల్ వారి వల్ల మళ్ళీ తన క్రేజ్ కు దెబ్బ పడుతుందేమో అని తేజ్ భయపడుతున్నట్టు తెలుస్తోంది.
సాయి ధరమ్ తేజ్ ని అంతలా కంగారు పెడుతున్న సినిమా 'తిక్క'. సునీల్ కుమార్ రెడ్డి మరియు బీఆర్ దుగ్గినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాని రోహిన్ రెడ్డి నిర్మించాడు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు. ఈ సినిమా షూటింగ్ 'సుప్రీమ్', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' కంటే ముందే ఫినిష్ అయినా.. ప్రివ్యూ చూసిన బయ్యర్స్ కొనుగోలు చెయ్యడానికి ముందుకు రాలేదు. ఆ రెండు సినిమాలు రిలీజ్ అయ్యి హిట్ అవ్వడం తర్వాత తేజ్ మార్కెట్ కాస్త పెరగడంతో 'తిక్క' సినిమా విడుదలకు నోచుకుంది. అయితే ప్రేక్షకులు క్రిటిక్స్ ఈ చిత్రాన్ని ఏకి పారేశారు. తేజు స్టోరీ సెలక్షన్ పై కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఇంతటి చేదు జ్ఞాపకాన్ని మిగిల్చిన అట్టర్ ప్లాప్ 'తిక్క' సినిమాని వారంలో నాలుగైదు సార్లు టెలికాస్ట్ చేస్తున్నారట ఓ టీవీ ఛానల్ వారు. లాక్ డౌన్ నేపధ్యంలో సీరియల్స్ షూటింగ్ లు కూడా నిలిచిపోయాయి. దీంతో సీరియల్స్ ను మళ్ళీ మొదటి నుండీ టెలికాస్ట్ చెయ్యడం.. మిగిలిన టైంలో సినిమాలు టెలికాస్ట్ చేసి మ్యానేజ్ చెయ్యాలి అని ఛానెల్స్ వారు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఛానల్ వారు రిపీటెడ్ గా టెలికాస్ట్ చేస్తున్నారట. అయితే దాని వల్ల తన కెరీర్ పై ఎఫెక్ట్ పడుతుందేమో అని తేజ్ భయపడుతున్నాడట. తేజ్ కెరీర్లో మంచి హిట్ సినిమాల్ని వదిలేసి ఆ సినిమానే రిపీటెడ్ గా టెలికాస్ట్ చేసి తేజ్ కి ఎందుకు 'తిక్క'రేగేలా చేస్తున్నారో మరి.