Begin typing your search above and press return to search.

సాయిధరమ్ ను ఏడిపించేసిన వెన్నెల కిషోర్

By:  Tupaki Desk   |   26 Nov 2015 5:00 PM IST
సాయిధరమ్ ను ఏడిపించేసిన వెన్నెల కిషోర్
X
‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాతో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్. ఇప్పుడతడి చేతిలో బోలెడన్ని అవకాశాలున్నాయి. అయనప్పటికీ పొగరేమీ తలకెక్కించుకోకుండా అందరితో చాలా ఫ్రెండ్లీగా - కలివిడిగా ఉంటాడని అంటారు అతడితో పని చేసే నటీనటులు. సోషల్ మీడియాలో సాయిధరమ్ పెట్టే ట్వీట్లు కానీ.. అతడి కామెంట్లు కానీ చూసినా మెగా కుర్రాడు చాలా సరదా మనిషని.. చాలా సింపుల్ గా, క్యాజువల్ గా ఉంటాడని అర్థమైపోతుంది. తాజాగా వెన్నెల కిషోర్ తో కలిసి సాయి ట్విట్టర్ లో పెట్టిన ఫొటో చాలా ఫన్నీగా ఉండి.. జనాలకు వినోదాన్నిచ్చింది.

సాయి కోసం కిషోర్ ఓ ఫోన్ గిఫ్టుగా తీసుకెళ్లి ఇచ్చాడు. అది చూసి సాయి చాలా ఎగ్జైట్ అయిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటున్న ఫొటోను ట్విట్టర్ లో పెట్టాడు. ‘‘హ్యపీ టియర్స్ అన్నా.. నీలాంటి అన్నయ్యను ఎక్కడా చూడలేదు. నువ్విచ్చిన గిఫ్టుకి చాలా థ్యాంక్స్’’ అంటూ ట్వీట్ పెట్టి ఓ ఫన్నీ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశాడు సాయి. దీనికి కిషోర్ కూడా ఫన్నీగా బదులిచ్చాడు. ఏదో శ్రీకృష్ణుడికి అటుకులిచ్చిన కుచేలుడిలా ఉడతా భక్తిగా తానేదో చేశానని అన్నాడు. మధ్యలో హరీష్ శంకర్ కూడా జాయినై.. సాయితో కలిసి కిషోర్ మీద ఫన్నీ కామెంట్లు చేశారు. మొత్తానికి ఈ ముగ్గురి మధ్య వ్యవహారం వీళ్ల ట్విట్టర్ ఫాలోయర్లకు మంచి వినోదాన్నే అందించింది.