Begin typing your search above and press return to search.
ఫ్లాప్స్ లో ఉన్న నాతో సినిమా తీసినందుకు థ్యాంక్స్
By: Tupaki Desk | 8 April 2019 7:23 AM GMTమెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన 'చిత్రలహరి' చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాల నడుమ రాబోతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను తాజాగా నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో సాయి ధరమ్ తేజ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. వరుసగా ఆరు సినిమాలు ఫ్లాప్ అయినా నాతో సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చిన మైత్రి మూవీస్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ చిత్రం తప్పకుండా మా అందరికి మంచి విజయాన్ని అందిస్తుందనే నమ్మకం తనకు ఉందని తేజూ చెప్పుకొచ్చాడు.
ఇంకా తేజూ మాట్లాడుతూ... దర్శకుడు కిషోర్ తనకు చాలా రోజులుగా పరిచయం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో పని చేయాలని మా అమ్మగారు కోరుకున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ గారు సంగీతం ఇవ్వడం వల్ల మా అమ్మ కోరిక నెరవేరింది. వరుసగా ఫ్లాప్ లు వచ్చినా నేను ఇంకా ఇక్కడ నిలబడి ఉన్నాను అంటే అది మా మామయ్యల వల్ల మరియు మెగా ఫ్యాన్స్ వల్లే. వారి రుణం తప్పకుండా తీర్చుకుంటాను అన్నాడు.
దర్శకుడు కొరటాల మాట్లాడుతూ పలువురు దర్శకులకు అవకాశాలు ఇస్తున్న మైత్రి మూవీస్ సంస్థ నిజం గొప్ప సంస్థ. పెద్ద హీరోలతో పెద్ద సినిమాలే కాకుండా కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను, కొత్త దర్శకులను ప్రోత్సహించాలని చూస్తున్న మైత్రి మూవీస్ నిర్మాతలు నిజంగా అభినంద నీయులు. రైటర్ గా చాలా మంచి ప్రతిభ ఉన్న వ్యక్తి కిషోర్. మాతో రైటర్ గా చేసే సమయంలో ఆయన ప్రతిభ చూశాను. ఈకథ నాకు తెలుసు, తప్పకుండా హిట్ అవుతుందని చెప్పుకొచ్చాడు.
నా మూడు సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ గారు అందించిన పాటు ప్లస్ అయ్యాయి. అలాగే ఈ సినిమాకు కూడా తప్పకుండా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్లస్ అవుతుంది. నేను రైటర్ గా ఉన్నప్పటి నుండి తేజూతో ట్రావెల్ అవుతూ వచ్చాను. ఇది అందరికి నచ్చే విధంగా ఒక మంచి సినిమాగా నిలుస్తుందని దర్శకుడు కిషోర్ తిరుమల ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈనెల 12న పెద్ద ఎత్తున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం తేజూ వరుస ఫ్లాప్‌లకు బ్రేక్ వేస్తుందా అనేది చూడాలి.