Begin typing your search above and press return to search.

ద‌ర్శ‌కుడికి లైన్ అందించి హిట్టు కొట్టాడ‌ట‌!

By:  Tupaki Desk   |   26 Dec 2019 4:50 AM GMT
ద‌ర్శ‌కుడికి లైన్ అందించి హిట్టు కొట్టాడ‌ట‌!
X
హీరో అంటే కేవ‌లం న‌టిస్తే స‌రిపోతుందా? ఇటీవ‌లి కాలంలో మ‌న హీరోలంతా క్రియేటివ్ పార్ట్ లోనూ ఓ చెయ్యేస్తున్నారు. కొంద‌రైతే క‌థ‌లు కూడా రాసేస్తున్నారు. ఆ కోవ‌లో చూస్తే సుప్రీం హీరో సాయి తేజ్ సైతం క్రియేటివిటీలో స‌త్తా చూపిస్తున్నాడ‌న్న‌ది తాజా స‌మాచారం.

ఒక సినిమా తెర‌పైకి రావాలంటే ద‌ర్శ‌క ర‌చ‌యిత‌తో క‌లిసి హీరో- నిర్మాత క‌థా చ‌ర్చ‌ల్లో పాల్గొంటార‌న్న సంగ‌తి తెలిసిందే. ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ల‌ ఆలోచ‌న‌లోంచే క‌థ పుట్టినా డెవ‌ల‌ప్ చేసే ప్రాసెస్ లో హీరో ప్రాధాన్య‌త‌ను కొట్టి పారేయ‌లేం. ఒక్కోసారి హీరో గారే త‌న‌కు న‌చ్చిన లైన్ ని చెబితే ఆ లైన్ కు అనుగుణంగా డెవ‌ల‌ప్ చేయ‌డం.. న‌చ్చితే దాన్నే తెర‌పైకి తీసుకురావ‌డం జ‌రుగుతాయి. అదీ కొన్ని సార్లు ఎక్కువ‌గా వుండొచ్చు.. కొన్ని సార్లు త‌క్కువ‌గా వుండొచ్చు. అలా వ‌చ్చిన కొన్ని క‌థ‌లు ఆక‌ట్టుకోవ‌చ్చు. లేదా ఫ్లాప్ లుగా మారొచ్చు. కానీ ఈసారి మాత్రం ఆ హీరో ఇచ్చిన ఐడియా వ‌ర్క‌వుటైంది. వ‌రుస‌ ఫ్లాపుల్లో వున్న ఆ హీరోకు మంచి విజ‌యాన్ని అందించింది. అత‌నికి ఊర‌ట‌ని క‌లిగించి మ‌ళ్లీ స‌క్సెస్ బాట ప‌ట్టేలా చేసిన‌ ఆ సినిమా మ‌రేదో కాదు.. మారుతి తెర‌కెక్కించిన‌ `ప్ర‌తి రోజు పండ‌గే`.

ఈ సినిమాకి సెంట్ర‌ల్ ఐడియా ఇచ్చింది మెగా మేల్లుడు సాయి తేజ్. ఆ క‌థ‌ను డెవ‌ల‌ప్ చేయ‌డంలో మారుతి- బ‌న్నీవాసు - అర‌వింద్ వంటి దిగ్గ‌జాలు ఉన్నార‌ట‌. ప్ర‌తిరోజూ పండ‌గే ఇటీవ‌ల విడుద‌లై మౌత్ టాక్ తో మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంటోంది. ఈ సంద‌ర్భంగా ఈ చిత్ర యూనిట్ రాజ‌మండ్రిలో స‌క్రెస్ మీట్ ని ఏర్పాటు చేసింది. ఈ సినిమా ఐడియా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ దేన‌ని.. పేరెంట్స్ ని మిస్స‌వుతున్న ప్ర‌తి ఒక్క‌రికీ క‌నెక్ట్ అయ్యేలా సినిమా చేయాల‌నే ఆలోచ‌న మొద‌ట చెప్పింది అత‌డే అని, త‌ను చెప్పిన లైన్ డెవ‌ల‌ప్ చేసిన అల్లు అర‌వింద్ గారికి చెబితే వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ట‌. అలా సినిమా సెట్స్ పైకి వ‌చ్చిందని మారుతి అస‌లు సీక్రెట్ బ‌య‌ట‌పెట్టారు.