Begin typing your search above and press return to search.

మెగా హీరో మానవత్వం

By:  Tupaki Desk   |   5 Sep 2019 4:44 AM GMT
మెగా హీరో మానవత్వం
X
మెగా హీరో సాయిధరమ్ తేజ్ తన మనవత్వాన్ని చాటారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ను స్వయంగా ఎత్తుకొని వచ్చి కార్లో తరలించిన వైనంపై ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి.

మెగా హీరో సాయిధరమ్ తేజ్ తాజాగా రోడ్డు ప్రమాదం బారిన రోడ్డు పక్కన పడి విలవిల్లాడుతున్న ఓ వ్యక్తిని తన కారులో స్వయంగా ఎత్తుకొని దించి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాధిత వ్యక్తి కూడా సినీ రంగానికి చెందినవాడే కావడం గమనార్హం. జూబ్లిహిల్స్ లో నిన్న సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నానక్ రామ్ గూడ రామానాయుడు స్టూడియోలో షూటింగ్ ముగించుకొని సాయిధరమ్ తేజ్ ఇంటికి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఓ బైక్ అదుపు తప్పి కారును ఢీకొట్టింది. దీంతో బైకర్ 10 అడుగులు ఎగిరి దూరం పడ్డాడు.

జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 42 వద్ద ఓ మూలమలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ పై నుంచి పడి యువ సంగీత దర్శకుడు అచ్చు రాజమణి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయంలో వెనుకే వస్తున్న హీరో సాయిధరమ్ తేజ్ ప్రమాదాన్ని వెంటనే గుర్తించి తన వాహనాన్ని నిలిపివేసి అతడిని కాపాడాడు.

ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి సాయిధరమ్ కు తెలిసిన యువ సంగీత దర్శకుడు కావడంతో మరో వ్యక్తి సాయంతో సాయిధరమ్ తన చేతులపై మోసుకొచ్చి మరీ తన కారులో అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. రాజమణి కాలుకు తీవ్రగాయమైనట్టు తెలిసింది. వైద్యులు చికిత్స చేస్తున్నారు. ప్రాణాపాయం ఏదీ లేదని తేల్చారు. మొత్తంగా రోడ్డుపై జరిగిన యాక్సిడెంట్ చూసి పోకుండా బాధితుడిని స్వయంగా కాపాడి, ఆస్పత్రికి తీసుకెళ్లిన సాయిధరమ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.