Begin typing your search above and press return to search.

అల్లుడు.. మేనల్లుడు.. మెగా ఫైట్

By:  Tupaki Desk   |   15 Jun 2018 3:32 AM GMT
అల్లుడు.. మేనల్లుడు.. మెగా ఫైట్
X
టాలీవుడ్ లో ఎక్కువ మంది హీరోలున్నది మెగా కాంపౌండ్ లోనే. నెల.. రెండు నెలల గ్యాప్ లోనే మెగా కాంపౌండ్ లోని హీరో ఎవరో ఒకరి సినిమా థియేటర్లకు వస్తూనే ఉంటుంది. మెగా హీరోలందరిలో సఖ్యత బాగానే ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఇద్దరి సినిమాలు ఒకేరోజు రిలీజ్ కాకుండా చూసుకుంటారు. కానీ ఇప్పుడు ఇద్దరు హీరోలు ఒకేసారి పోటీ పడుతున్నారు.

మెగా కాంపౌండ్ లో కొత్తగా చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా రంగప్రవేశం చేస్తున్నాడు. ఇతడి తొలిసినిమా జులై 6న థియేటర్లకు రానుంది. ఇదే సమయంలో చిరు మేనల్లుడయిన సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ తేజ్.. ఐ లవ్ యూ కూడా అదే రోజున రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. వీటిలో విజేత ఫ్యామిలీ స్టోరీ కాగా.. తేజ్.. ఐలవ్ యూ రొమాంటిక్ ఎంటర్ టెయినర్. ఈ రెండు వేర్వేరు జోనర్లు కావడంతో ఒకే రోజు రిలీజ్ చేసినా పెద్దగా ఇబ్బంది ఉండదని నిర్మాతలు ముందుకెళ్తున్నారు.

ఇంతకుముందు మెగా ఫ్యామిలీలో వరుణ్ తేజ్ - సాయి ధరమ్ తేజ్ ఇలాగే పోటీ పడ్డారు. వీళ్లిద్దరూ నటించిన తొలిప్రేమ - ఇంటిలిజెంట్ సినిమాలు ఒకేటైంలో రిలీజయ్యాయి. దీనిపై చిరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొడుకు - మేనల్లుడు ఇద్దరికి గట్టిగానే క్లాస్ తీసుకున్నాడనే టాక్ వినిపించింది. మళ్లీ నెలల వ్యవధిలోనే అలాంటి పోటీ తలెత్తడం మెగా ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరుస్తోంది. ఈ టైంలో చిరు జోక్యం అవసరమని అభిమానులు కోరుకుంటున్నారు.