Begin typing your search above and press return to search.
లవ్ ఈజీ కాదు తేజు
By: Tupaki Desk | 10 Jun 2018 7:33 AM GMTసుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఆశలన్నీ తేజ్ ఐ లవ్ యు మీదే ఉన్నాయి. అసలే వరస పరాజయాలతో మార్కెట్ లో ఇమేజ్ డౌన్ అయిపోతోంది . ఎంత మెగా సపోర్ట్ ఉన్నా అది మొదటి ఆట వరకే పరిమితమని ఇంటెలిజెంట్ సినిమా వసూళ్ల సాక్ష్యంగా నిరూపించింది. కాబట్టి కంటెంట్ తో మెప్పిస్తే తప్ప రీమిక్సులు మసాలాలు సరిపోవని అర్థం చేసుకోవడానికి తేజుకి నాలుగు డిజాస్టర్లు అవసరమయ్యాయి. ఇక ఇప్పుడు వస్తున్న తేజ్ ఐ లవ్ యుకి భీభత్సమైన హైప్ ఏమి లేదు. పైగా మొదటిసారి లవర్ బాయ్ గా ట్రై చేస్తున్న సాయిధరమ్ తేజ్ ఆ పాత్రకు ఎంతవరకు సూట్ అయ్యుంటాడా అనే అనుమానాలు లేకపోలేదు. దానికి తోడు దర్శకుడు కరుణాకరన్ హిట్ ఇచ్చి చాలా కాలం అయ్యింది. ప్రభాస్ డార్లింగ్ బాగానే ఆడింది కానీ ఆ తర్వాత చేసిన రామ్ ఎందుకంటే ప్రేమంట ఫలితం మాత్రం బాగా తేడా కొట్టేసింది. ఎప్పుడో పవన్ కళ్యాణ్ తో తీసిన తొలిప్రేమ రిఫరెన్స్ నే ఇప్పుడూ వాడుకోవడం చూస్తేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దానికి తోడు అనుపమ పరమేశ్వరన్ గత రెండు సినిమాలు ఉన్నది ఒకటే జిందగీ-కృష్ణార్జున యుద్ధం రెండూ బోల్తా కొట్టినవే. హిట్ హీరోయిన్ స్టాంప్ ని అవి పూర్తిగా చెరిపేసాయి.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే నిర్మాత కెఎస్ రామారావు గారికి గట్టిగా చెప్పుకునే హిట్ దక్కి చాలా కాలమే అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన దమ్ము షాక్ ఇచ్చాక చాలా ఆచితూచి సినిమా నిర్మాణం చేస్తున్నారు. తేజ్ ఐ లవ్ మీద ఓవర్ బడ్జెట్ పెట్టకపోయినా సేఫ్ కావాలి అంటే కనీసం 15 నుంచి 20 కోట్ల దాకా షేర్ రావాలి.సినిమా బ్రహ్మాండంగా ఉందనే టాక్ వస్తేనే అది సాధ్యం . సంగీత దర్శకుడు గోపి సుందర్ ఆల్బం అవుట్ అండ్ అవుట్ అన్ని సాంగ్స్ బెస్ట్ అనేలా లేకపోవడం మరో ట్విస్ట్. నిన్ను కోరి తర్వాత అన్ని పాటలతో మెప్పించే ఆల్బం గోపి సుందర్ చేయలేదు .2 కంట్రీస్ తో పాటు ఇటీవలే వచ్చిన రాజుగాడుకి మెప్పించే మ్యూజిక్ ఇవ్వలేకపోయాడు. హీరో హీరోయిన్ మొదలుకుని ప్రతి విషయంలో ఇన్ని ప్రతికూలతలు ఉన్న తేజ్ ఐ లవ్ ముందు పెద్ద సవాలే ఉంది. జూన్ 29 పోటీగా ప్రస్తుతానికి వేరే తెలుగు సినిమా ఏది ప్రకటించనప్పటికీ బాలీవుడ్ నుంచి మోస్ట్ అవైటెడ్ మూవీ సంజు బరిలో ఉంది. ఎ సెంటర్స్ లో దానితో పోటీ పడటం ఈజీ కాదు. పైగా పరాజయం ఎరుగని రాజ్ కుమార్ హిరానీ దర్శకుడు. సినిమాలో హీరోయిన్ తో తేజు ఐ లవ్ చెప్పడం ఈజీ ఏమో కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులతో చెప్పించాలంటే మాత్రం పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చేలా ఉంది.