Begin typing your search above and press return to search.
అన్నీ మేనమామల పోలికలే
By: Tupaki Desk | 24 Sep 2015 3:17 PM GMTసాయిధరమ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ రిలీజైంది. ఈ సినిమాలో సాయిధరమ్ పెర్ఫామెన్స్ కి మెగా ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అతడిలోని ఎనర్జీ లెవల్స్ కి, బాడీ లాంగ్వేజ్ కి స్పెల్ బౌండ్ అయిపోతున్నారంతా. ముఖ్యంగా గువ్వ గోరింకతో రీమిక్స్ సాంగ్ అదిరిపోయిందంటూ టాక్ వచ్చింది. ఇందులో సాయిధరమ్ బాడీ లాంగ్వేజ్ - ఫ్రీ స్టయిల్ మేనమామ చిరంజీవిని తలపించిందని అంతా కామెంట్ చేస్తున్నారు.
అంతేకాదు.. చాలా సన్నివేశాల్లో దొంగమొగడు - బావగారు బావున్నారా? తరహా టింజ్ కనిపించిందని ముచ్చటించుకుంటున్నారు. కొన్ని సన్నివేశాల్లో మెగా హీరోల్ని ఇమ్మిటేట్ చేసినా, అసలు ఇమ్మిటేట్ చేయని సన్నివేశాలలోనూ అతడిలో మెగా స్టార్ పోలికలు కనిపించాయని చెబుతున్నారు. సాయిధరమ్ లో చాలా ఈజ్ ఉంది. డ్యాన్సులు - ఫైట్స్ లోనే కాదు.. వీలున్న ప్రతి సందర్భంలోనూ అవి బైటికి కనిపించాయి. మునుముందు మెగా హీరోల్లోనే పెద్ద స్టార్ అవుతాడంటూ విమర్శకులు సైతం ప్రశంసించడం విశేషం.
అదొక్కటే కాదు కామెడీ - రొమాన్స్ లనూ సాయిధరమ్ అంత తక్కువేమీ కాదు.. అచ్చం మెగాస్టార్ పోలికే. మేనమామ పోలికలే .. అంటూ గుచ్చి గుచ్చి మాట్లాడుకోవడం ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. మొత్తానికి పిల్లా నువ్వు లేని జీవితం తర్వాత మరో మాంచి రిజల్టునే కొట్టాడు కుర్రాడు. అక్కడక్కడా మిక్స్ డ్ టాక్ ఉన్నా కూడా మనోడు కమర్షియల్ గా కుమ్మేసే ఛాన్సుందంటున్నారు. మునుముందు ఇలాగే దూసుకుపోతే ఇక స్టారాధి స్టారే అయిపోతాడు.