Begin typing your search above and press return to search.
మెగా మేనల్లుడు ఫుట్ బాల్ హీరోనా?
By: Tupaki Desk | 31 July 2016 9:30 AM GMTతొలి సినిమా ‘రేయ్’లో ఒకరకంగా కనిపించాడు.. రెండో సినిమా ‘పిల్లా నువ్వు జీవితం’ సినిమాలో ఇంకో రకంగా కనిపించాడు సాయిధరమ్. ఐతే ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ దగ్గర్నుంచి మాత్రం ఒకేరకమైన లుక్ మెయింటైన్ చేస్తున్నాడు. తాజాగా ‘తిక్క’ సినిమాకు కూడా లుక్ లో పెద్దగా మార్పేమీ కనిపించలేదు. ఐతే ఇలాగే కనిపిస్తే ప్రేక్షకులకు మొనాటనీ వచ్చేస్తుందని తన కొత్త సినిమాకు అవతారం మార్చేస్తున్నట్లున్నాడు తేజు.
‘తిక్క’ ఆడియో వేడుకలో అతడి నయా లుక్ జనాలకు పెద్ద షాకే. జుట్టు వెరైటీగా కట్ చేయించి..గడ్డానికి కూడా టచప్ ఇచ్చి.. ట్రెండీగా వెరైటీగా ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా దర్శనమిచ్చాడు సాయిధరమ్. నిర్మాత దిల్ రాజు ఈ గెటప్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఏంటి సాయిధరమ్.. ఏంటీ గెటప్ అంటూ అడిగాడు కూడా. సాయిధరమ్ నవ్వేసి ఊరుకున్నాడు. ‘తిక్క’ తర్వాత సాయిధరమ్ రెండు సినిమాల్ని లైన్లో పెట్టాడు. ఒకటి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో.. ఇంకోటి బి.వి.ఎస్.రవి డైరెక్షన్లో.
వీటిలో ముందు గోపీచంద్ సినిమా పట్టాలెక్కనుంది. ఆగస్టు 20న ఫారిన్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఈ చిత్రాన్ని నిర్మిస్తాడు. బహుశా ఈ సినిమా కోసమే సాయిధరమ్ కొత్త లుక్ ట్రై చేస్తున్నట్లున్నాడు. ఇది స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్లో సాగే సినిమా అంటున్నారు. మామూలుగా ఫుట్ బాలర్లు ఇలా చిత్ర విచిత్రమైన హేర్ స్టైల్స్ ట్రై చేస్తుంటారు. ఇంగ్లిష్ ప్రిమియర్ లీగ్ లాంటి టోర్నీలు ఫాలో అయ్యేవాళ్లకు ఈ సంగతి బాగా తెలుస్తుంది. మరి సాయిధరమ్ సినిమా ఫుట్ బాల్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందా?