Begin typing your search above and press return to search.

ఇంటర్యూ: చిరంజీవిని అందుకోవడం ఈజీ కాదు

By:  Tupaki Desk   |   21 Sep 2015 1:30 PM GMT
ఇంటర్యూ: చిరంజీవిని అందుకోవడం ఈజీ కాదు
X
మెగా ఫ్యామిలీ నుంచి దూసుకొచ్చిన యువ‌కెర‌టం సాయిధ‌ర‌మ్ తేజ్‌. ఆరంభ‌మే పిల్లా.. నువ్వులేని జీవితం’ స‌క్సెస్‌ తో పేరు తెచ్చుకున్నాడు. తాజాగా హరీష్ శంకర్ దర్శకుడిగా, దిల్‌ రాజు నిర్మాత‌గా తెర‌కెక్కిన సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్ చిత్రంలో న‌టించాడు. ఈ సినిమా సెప్టెంబర్ 24న రిల‌జీవుతోంది. ఈ సందర్భంగా సాయిధరమ్ చెప్పిన సంగ‌తులివి....

సుబ్ర‌హ్మ‌ణ్యం స్ట‌యిల్ పై?

=ఈ చిత్రం హరీష్ శంక‌ర్ శైలిలో సాగే కమర్షియల్ ఎంటర్‌ టైనర్. నిర్మాత దిల్‌ రాజు ఫార్ములాని గుర్తు చేస్తూ.. ఫ్యామిలీ ఎలిమెంట్స్‌ కు పెద్ద పీట వేశారు. కుటుంబ సెంటిమెంట్ బ‌లంగా ఉంటుంది. మొత్తంగా ఇదో పూర్తి స్థాయి ఎంట‌ర్‌ టైనింగ్ ప్యాకేజ్‌.

మీ క్యారెక్ట‌రైజేష‌న్‌?

సుబ్రమణ్యం పాత్ర చిత్ర‌ణ‌ చాలా కొత్తగా ఉంటుంది. డబ్బు కోసం డిఫ‌రెంట్ కోణంలో వ‌సూళ్లు చేసే వాడు సుబ్బు. పాత్ర ఆధారంగా చేసుకొని కథలోని ఎమోషన్ నడుస్తూ ఉంటుంది. సుబ్రమణ్యంకి డ‌బ్బు అవ‌స‌రం ఏమిటి? అత‌డు అమెరికా ఎందుకు వెళ్ళాడు? ఇలాంటి ప్రశ్నల చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. నా గ‌త రెండు చిత్రాల కంటే వైవిధ్యంగా క‌థాంశం ఉంటుంది.

అంటే ఇందులో కొత్త పాయింట్ ఏమిటో?

ఇందులో నాలోని మరో కోణాన్ని చూస్తారు. ఎమోషన్, రొమాన్స్ సన్నివేశాల్లో కొత్తదనం కో్సం ప్ర‌య‌త్నించా. నా పాత్ర కోసం ద‌ర్శ‌కుడితో క‌లిసి బోలెడంత డిష్క‌స్ చేశాను. ఈ ప్రాసెస్ అంతా ఏదైనా డిగ్రీ చ‌దువుతున్నామా? అన్న‌ట్టే ఉంది. నా జీవితంలో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’.. ఓ మరచిపోలేని అనుభూతి.

మీ ద‌ర్శ‌కుడి గురించి?

హరీష్ ‘మిరపకాయ్’ సినిమా తీసిన‌ప్ప‌ట్నుంచి బాగా తెలుసు. ఈ సినిమా ఆరంభానికి ముందే..నేనిప్పుడు ఫ్లాపిచ్చిన డైరెక్టర్‌ ని - గబ్బర్ సింగ్’ డైరెక్టర్‌ ను కాను అని అన్నారు. కథ వినగానే ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం కలిగింది. వెంటనే చేసేద్దాం అని నిర్ణ‌యించుకున్నా. హరీష్‌ తో క‌లిసి ప‌నిచేయ‌డం అంటే ఓ పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది.

రెజీన గురించి?

రెజీనా ఓ మంచి ఫ్రెండ్. ఇద్దరం చాలా విషయాలు మాట్లాడుకుంటూంటాం. స్నేహితుల‌మే కాబట్టి ఆన్‌ సెట్స్ స‌ర‌దాగానే గడిచిపోయింది. నాకు బేసిగ్గా రొమాన్స్ సన్నివేశాల్లో నటించాలంటే ఇబ్బంది. అలాంటివి చేయాల్సి వచ్చినపుడు రెజీనా, నేను ముందే డిస్కస్ చేసుకొని సీన్ సరిగ్గా రావడానికి మా వంతుగా ఏమేం మార్పులు చేయొచ్చో ముందే అనుకునేవాళ్లం.

చిరు రీమిక్స్ సాంగ్ గురించి?

గువ్వ గోరింక‌తో .. సాంగ్ ఎన‌ర్జిటిక్ సాంగ్‌. ఈ సినిమాలో ఒక మెలోడీలా కనిపిస్తూనే, మంచి ఎనర్జీనిచ్చే పాట రావాల్సిన సందర్భం ఒకటి ఉంది. దానికి మావయ్య సినిమాల్లోని ఈ పాటను రీమిక్స్ చేస్తే బాగుంటుందని ఎంచుకున్నాం. మావ‌య్య సాంగ్‌ స్థాయిని అందుకోవడం సాధ్యమయ్యే పనికాదు. మా వ‌ర‌కూ ఓ ఎటెంప్ట్ చేశాం అంతే.

మావ‌య్య సినిమా రీమేక్ చేయ‌రా?

= అలాంటి ఆలోచనే చేయ‌ను. చిరంజీవిని అందుకోవడమంటే అంత ఈజీ కాదు. ఇలా మన సినిమాలు చేస్తూ పోవడమే కానీ, మావయ్య సినిమాలు రీమేక్ చేయడమనే ఆలోచనను దగ్గరకు రానివ్వను.

మావ‌య్య‌ల బాడీ లాంగ్వేజ్‌ ని ఇమ్మిటేట్ చేయ‌రా?

= మావ‌య్య‌ల‌ బాడీ లాంగ్వేజ్‌ ను ఫాలో అవ్వడం, ఇమిటేట్ చేయడం లాంటివి అస్సలు చేయను. చిన్నప్పట్నుంచీ మావయ్య వాళ్ళను దగ్గర్నుంచి చూస్తూ పెరిగిన వాడిని కావడంతో వాళ్ళ మ్యానరిజమ్స్ కొన్ని నాకూ వచ్చాయి. అంతే తప్ప కావాలని ఇమిటేట్ చేసే ప్రయత్నాలు మాత్రం చేయను.

రాజుగారి వెంటే ప‌డుతున్న‌ట్టున్నారు? రీజ‌న్‌?

= ఆయన మంచి కథలతో రెడీగా ఉన్నారు. అవన్నీ నాకూ నచ్చాయి. దీంతో వరుసగా క‌మిట‌య్యా. పిల్లా నువ్వులేని జీవితం - సుబ్రమణ్యం ఫర్ సేల్ - అనిల్ రావిపూడి సినిమా - శతమానం భవతి అన్నీ శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌లోనే.

ఆన్‌ సెట్స్ ఏం ఉన్నాయ్‌?

=‘తిక్క’ సినిమా ఆన్‌ సెట్స్‌ లో ఉంది. అనిల్ రావిపూడితో చేస్తోన్న సినిమా ప్రీ ప్రొడక్షన్ జ‌రుగుతోంది. త్వరలోనే సెట్స్‌ కెళ‌తాం. అలాగే ‘శతమానం భవతి’ ప్రారంభం కానుంది.

కాంపిటీట‌ర్స్ గురించి?

=పోటీ గురించి నేను ఆలోచించ‌ను. ఒకేరోజు ఎన్ని సినిమాలు రిలీజైనా బావుంటే జ‌నాలు ఆద‌రిస్తారు. పోటీలో సినిమాలు రిలీజ్ కావ‌డం మంచిదే.