Begin typing your search above and press return to search.

ఇంతకీ గెడ్డం ఎందుకు తేజు!

By:  Tupaki Desk   |   12 April 2019 10:09 AM GMT
ఇంతకీ గెడ్డం ఎందుకు తేజు!
X
ఇవాళ విడుదలైన చిత్రలహరి ఫైనల్ తీర్పు బాక్స్ ఆఫీస్ స్టేటస్ తేలడానికి ఇంకొంత టైం పడుతుంది కానీ గత ఏడాది తీసిన ఆణిముత్యాల కంటే ఇది బెటర్ అనే టాక్ అయితే పబ్లిక్ లో వస్తోంది. వరసగా ఆరు డిజాస్టర్లతో కెరీర్ ని డిఫెన్స్ లో పడేసుకున్న తేజుకి భారీ హిట్ కావాల్సిన తరుణంలో చిత్రలహరి వచ్చింది. టార్గెట్ రీచ్ అయ్యిందా లేదా అనేది పక్కన పెడితే ఇందులో తేజు గెడ్డం చర్చకు వస్తోంది.

కథ ప్రకారం హీరో నిరుద్యోగి. అంత మాత్రాన అంతేసి గెడ్డం పెంచుకుని ఏ యువకుడూ ఉండడు. పోనీ జులాయి అనుకుంటే సరేలే అని సర్దిచెప్పుకోవచ్చు. ఇంజనీరింగ్ చదివి ఓ స్వంత ప్రాజెక్ట్ తో కంపెనీల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. సో బేవార్స్ బ్యాచ్ కిందకు వేయలేం. పదే పదే మందు కొట్టడం తప్ప ఇంకే బలహీనతలు ఉండవు. గమనిస్తే కేవలం ట్రెండ్ నడుస్తోంది కాబట్టి సెంటిమెంట్ గా వర్క్ అవుట్ అవుతుందేమో అన్న అంచనా తప్ప ఇంకే కారణం కనిపించడం లేదు

అయితే గెడ్డం మరీ గుబురుగా ఉండటంతో లుక్ బాగున్నా చాలా ఎక్స్ ప్రెషన్స్ అందులో కలిసిపోయాయి. ఈ కథకు తేజు క్లీన్ షేవ్ తో ఉన్నా సరిపోయేది. మైనస్ అనిపించేది కాదు. కానీ ప్రేక్షకులు కొంత డిఫరెంట్ గా ఫీలవ్వాలనే ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేశారు తప్ప గెడ్డానికి కథకు సంబంధం లేదనే విషయం అర్థమైపోయింది. మెగా హీరోల గెడ్డం సిరీస్ లో రామ్ చరణ్ రంగస్థలంతో వరుణ్ తేజ్ తొలిప్రేమతో హిట్లు కొట్టారు. మరి తేజు ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో లెట్ వెయిట్ అండ్ సి