Begin typing your search above and press return to search.

ఆ దర్శకుడితో మెగా హీరో సాహసం

By:  Tupaki Desk   |   30 Nov 2017 7:33 AM GMT
ఆ దర్శకుడితో మెగా హీరో సాహసం
X
టాలీవుడ్ లో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అదృష్టం ఏమిటో గాని జయపజయలతో సంబంధం లేకుండా అవకాశాలను అందుకుంటున్నాడు. కెరీర్ మొదట్లో హిట్స్ బాగానే అందుకున్నా ఆ తర్వాత కొంచెం విన్నింగ్ రేస్ లో వెనుకబడ్డాడు. అయితే మనోడి చేతిలో ఇప్పుడు మంచి అవకాశాలే ఉన్నాయి. ఫైనల్ గా ఇప్పుడు జవాన్ సినిమాను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక నెక్స్ట్ వివి. వినాయక్ ప్రాజెక్ట్ పై పూర్తిగా దృష్టి పెట్టనున్నాడు.

అలాగే మరో సీనియర్ దర్శకుడి కథను కూడా సాయి వెయిటింగ్ లిస్ట్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే వినూత్న చిత్రాల దర్శకుడు అయిన చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో కూడా సాయి ఒక సినిమాను చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే - అనుకోకుండా ఒకరోజు అలాగే ఒక్కడున్నాడు వంటి వెరైటీ సినిమాలను తీసిన చంద్రశేఖర్ గత కొంతకాలంగా సరైన హిట్స్ అందుకోవడం లేదు. గోపిచంద్ తో సాహసం సినిమాను తీసి పర్వాలేదు అనిపించినా భారీ విజయాన్ని మాత్రం అందుకోలేదు.

ఆ తర్వాత మనమంతా సినిమాతో కూడా అంతగా ఆకట్టుకోలేదు. రిజల్ట్ ఎలా ఉన్నా ఈ దర్శకుడు ఎదో ఒక పాయింట్ ని కొత్తగా చూపించాలని ట్రై చేస్తాడు. అదే తరహాలో ఇప్పుడు మెగా మేనల్లుడిని కొత్తగా చూపించాలని ఆలోచిస్తున్నాడట. అయితే సాయిధరమ్ తేజ్ మాత్రం తన కెరీర్ లో ఎక్కువగా కమర్షియల్ సినిమాలనే చేశాడు. మరి ఈ వెరైటీ కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుందో చూడాలి.