Begin typing your search above and press return to search.
సాయిధరమ్.. ఒక ఇంట్రెస్టింగ్ మూవీ
By: Tupaki Desk | 6 Feb 2018 11:24 AM GMTఅరంగేట్ర సినిమా ‘రేయ్’ సంగతెలా ఉన్నా.. ఆ తర్వాత మూడు వరుస హిట్లతో స్టార్ ఇమేజ్ సంపాదించాడు సాయిధరమ్ తేజ్. కానీ ఆ తర్వాత సినిమాల ఎంపికలో తప్పటడుగులు అతడి కెరీర్ ను దెబ్బ తీశాయి. వరుసగా నాలుగు ఫ్లాపులతో తిరోగమన బాట పట్టాడు మెగాస్టార్ మేనల్లుడు. అతడి కొత్త సినిమా ‘ఇంటిలిజెంట్’ మీద కూడా పెద్దగా అంచనాల్లేవు. దీని ప్రోమోలన్నీ చాలా రొటీన్ గా అనిపించాయి జనాలకు. సినిమాకు ఆశించినంత బజ్ రావట్లేదు. ఇది ఎలాంటి ఫలితాన్నిస్తుందో అన్న సందేహాలు కలుగుతున్నాయి. దీని తర్వాత తేజు.. కరుణాకరన్ లాంటి ఫ్లాప్ డైరెక్టర్ తో పని చేస్తున్నాడు. తొలి సినిమా ‘తొలి ప్రేమ’ తర్వాత దానికి దరిదాపుల్లోకి రాగల సినిమా ఒక్కటీ తీయలేదు కరుణాకరన్. దీంతో ఆ సినిమా మీద కూడా జనాలకు డౌట్లు కొడుతున్నాయి. సినిమాల ఎంపికలో తేజుకు సరైన గైడెన్స్ లేకపోతోందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి.
ఇలాంటి తరుణంలో తేజు ఒక ఇంట్రెస్టింగ్ సినిమాకు ఓకే చెప్పాడు. కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నట్లే అతను విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటితో పని చేయబోతున్నాడట. యేలేటి శైలికి తగ్గట్లే ఒక వైవిధ్యమైన కథతో ఈ చిత్రం తెరకెక్కనుందట. తేజు ఇప్పటిదాకా హిట్లు కొట్టినా.. ఫ్లాపులు ఎదుర్కొన్నా చాలా వరకు రొటీన్ సినిమాలే చేశాడు. అతను కొత్తగా ఏమీ ట్రై చేయలేదు. నటుడిగా అతడికి సవాలు విసిరే సినిమాలు రాలేదు. ఐతే యేలేటి సినిమా అంటే కచ్చితంగా అందులో వైవిధ్యం ఉంటుంది. నటనకు ఆస్కారముంటుంది. డ్యాన్సులు.. ఫైట్లు తప్పితే తేజు సినిమాల్లో ఏమీ ఉండట్లేదన్న విమర్శలకు యేలేటి సినిమాలో ఆస్కారం ఉండదు. యేలేటికి కమర్షియల్ సక్సెస్ లు తక్కువే కానీ.. ఈ ట్రెండుకు తగ్గ వైవిధ్యమైన సినిమాలు తీయగల సత్తా అతడికి ఉంది. మరి యేలేటి-తేజు కాంబినేషన్లో రాబోయే సినిమా ఇద్దరికీ మంచి ఫలితాన్నిస్తుందేమో చూద్దాం.