Begin typing your search above and press return to search.

సెంటిమెంటు హిట్టిస్తుందా సుప్రీం?

By:  Tupaki Desk   |   20 Nov 2019 1:30 AM GMT
సెంటిమెంటు హిట్టిస్తుందా సుప్రీం?
X
సెంటిమెంటు ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌తిదీ వింత‌గానే అనిపిస్తుంది. ఒక‌సారి ఏదైనా సెంటిమెంటు బ‌ల‌ప‌డితే ఇక అది వ‌ద‌ల‌దు. సంఖ్యా శాస్త్రం ప్ర‌కారం పేరులో అక్ష‌రాలు హెచ్చు త‌గ్గులు చేయ‌డం.. పూజా కార్య‌క్ర‌మాల‌కు తానొక్క‌డే అటెండ్ కాక‌పోవ‌డం.. లేదా ఇంట్లోంచి కాలు బ‌య‌ట పెట్టేప్పుడే టంచ‌నుగా టైమ్ చూస్కోవ‌డం వ‌గైరా వ‌గైరా వ్య‌వ‌హారాలు సెంటిమెంటు ప‌రిశ్ర‌మ‌లో క‌నిపిస్తుంటాయి. మంచి ముహూర్తం లేనిదే ఒక్క ఠెంకాయ కూడా ప‌గ‌ల‌దు. అంత అలెర్టుగానే ప్రారంభోత్స‌వాలు చేస్తుంటారు. కొంద‌రైతే ఫ‌లానా ఆఫీస్ లో అయితేనే స‌క్సెస్ ద‌క్కుతోంద‌ని అదే చోట పెద్ద మొత్తాలు అద్దెలు క‌డుతూ ఏళ్ల త‌ర‌బ‌డి ఆఫీస్ లు మెయింటెయిన్ చేస్తారు. ఇక త్రివిక్ర‌మ్ - సునీల్ అయితే ఇప్ప‌టికీ త‌మ‌కు లైఫ్ నిచ్చిన పంజాగుట్ట రూమ్ కి అద్దె క‌డుతున్నారు.

ఇక‌పోతే మెగా హీరోల్లో సాయిధ‌ర‌మ్ తేజ్ సెంటిమెంటు కూడా ఇటీవ‌ల ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఆయ‌న త‌న పేరులోంచి ధ‌ర‌మ్ ని తొల‌గించి సాయి తేజ్ అని ట్రిమ్ చేసేశారు. ఆ పేరుతోనే చిత్ర‌ల‌హ‌రి టైటిల్ కార్డును చేయించారు. కొన్ని వ‌రుస ఫ్లాపుల త‌ర్వాత ఈ సినిమా త‌న‌కు ఊర‌ట‌నిచ్చే రిజ‌ల్టునే ఇచ్చింది. దీంతో మారిన పేరునే స‌ద‌రు మెగా హీరో కొన‌సాగిస్తున్నారు. ఒకవేళ చిత్ర‌ల‌హ‌రి ఫ్లాపై ఉంటే అంత‌గా ప‌ట్టించుకునే వారు కాదేమో కానీ.. తాను న‌టించే ప్ర‌తి సినిమాలోనూ టైటిల్ కార్డులో సాయి తేజ్ అనే వేస్తున్నార‌ట‌. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న ప్ర‌తిరోజు పండ‌గే టైటిల్ కార్డులోనూ సాయితేజ్ అనే పేరు క‌నిపిస్తుంది. తాజాగా `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్` సినిమాని ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించిన పోస్ట‌ర్ లోనూ సాయి తేజ్ అనే వేశారు. అంటే సాయి ధ‌ర‌మ్ తేజ్ బ‌దులుగా సాయి తేజ్ అని పూర్తిగా ఫిక్స‌యిన‌ట్టే. అయితే ఇలా పేరులోంచి ధ‌ర్మాన్ని తొల‌గించారేం అని బాధప‌డే ఫ్యాన్స్ కి సాయి తేజ్ ఏం చెబుతాడో? అయినా ఈ సెంటిమెంటు హిట్టిస్తుందా సుప్రీం? దీనిపై లాజిక్ ఏదైనా ఉంటే చెప్ప‌వూ?

ఇక ఇలా పేర్ల‌ను షార్ట్ చేయ‌డం ఒకందుకు మంచిదేన‌ని క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు. పొడ‌వాటి ఆ పేరులో మూడ‌క్ష‌రాలు త‌గ్గించ‌డంతో మీడియాలో రాసేవాళ్ల‌కు కూడా కొంత‌ శ్ర‌మ త‌గ్గింది. ఆరు ఇంగ్లీష్ అక్ష‌రాలు.. మూడు తెలుగు అక్ష‌రాల స‌మ‌యం త‌గ్గింది. ఇక సాయి తేజ్ బాట‌లోనే మ‌న హీరోలు టెక్నీషియ‌న్లంతా ఇలా ట్రిమ్ చేసుకుంటేనే బెట‌ర్. అది సెంటిమెంటుగా కూడా వ‌ర్క‌వుటైతే ఇంకా మంచిది. మ‌హేష్- చ‌ర‌ణ్‌-ప్ర‌భాస్-ఎన్టీఆర్ .. ఈ పేర్లు చూడండి ముచ్చ‌ట‌గా మూడ‌క్ష‌రాల‌తో ఎంత బావుంటాయో.. ఎవ‌రి టైమ్ ఈ పేర్ల వ‌ల్ల వేస్ట్ కానేకాదు.. ఇక పొడ‌వాటి బ్యాన‌ర్లు.. పొడ‌వాటి పేర్లు ఉన్న‌వాళ్లంతా ఇలా ట్రిమ్ చేసుకున్న త‌ర్వాత‌నే ఇండ‌స్ట్రీలో అడుగుపెడితే ఇంకా ఇంకా మంచిద‌ని భావిస్తున్నారు. మూడ‌క్ష‌రాలు కాదు సైరా- సాహో లాగా రెండ‌క్ష‌రాల పేరు అయితే ఇంకా భేషుగ్గా ఉంటుంది. సంఖ్యా శాస్త్రానికి మంచిది.. అన్ని కోణాల్లోనూ చాలామందికి మ‌రీ మంచిది.