Begin typing your search above and press return to search.
తేజు నోట.. నాలుగు ఫ్లాపుల మాట
By: Tupaki Desk | 4 Feb 2018 12:28 PM GMTవరుసగా మూడు సూపర్ హిట్ సినిమాలతో స్టార్ ఇమేజ్ సంపాదించాడు మెగా ఫ్యామిలీ కుర్రాడు సాయిధరమ్ తేజ్. ఇక అతను తర్వాతి స్టేజ్ కు వెళ్తాడని అనుకుంటుండగా వరుస ఫ్లాపులు అతడిని వెనక్కి లాగేశాయి. వరుసగా అతను నటించిన నాలుగు సినిమాలు నిరాశ పరిచాయి. చివరగా వచ్చిన ‘జవాన్’ కచ్చితంగా ఆడుతుందని ఆశించాడు తేజు. కానీ టాక్ పర్వాలేదనిపించినప్పటికీ ఆ సినిమా నిలబడలేదు. చివరికి అది కూడా తేజు ఫ్లాపుల జాబితాలో చేరిపోయింది. ఇప్పుడతడి ఆశలన్నీ ‘ఇంటిలిజెంట్’ మీదే ఉన్నాయి. తన కెరీర్ ఉన్న పరిస్థితిని పట్టించుకోకుండా ఇలాంటి సమయంలో వి.వి.వినాయక్ లాంటి అగ్ర దర్శకుడు తనతో సినిమా చేయడం తన అదృష్టమని అంటున్నాడు తేజు.
‘‘నా గత నాలుగు సినిమాలూ ఫ్లాపులే. అయినా సరే వినాయక్ గారి లాంటి పెద్ద దర్శకుడు ‘ఖైదీ నంబర్ 150’ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన తర్వాత నాతో సినిమా చేయడానికి ఒప్పుకోవడం నా అదృష్టం. ‘ఇంటిలిజెంట్’ సినిమా ఫలితం విషయంలో నాకు టెన్షనేమీ లేదు. చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేనెప్పుడూ సినిమాల ఫలితం గురించి ఆలోచించి ఒత్తిడికి గురి కాను. ‘ఇంటిలిజెంట్’ సినిమాను జనాలు బాగా ఎంజాయ్ చేస్తారని నమ్మకంతో ఉన్నా. ఈ సినిమాలో నేను తేజ అనే క్యారెక్టర్ చేస్తున్నాను. సాఫ్ట్ వేర్ ఇంటినీర్ గా కనిపిస్తా. అతడి జీవితం సంతోషంగా సాగిపోతున్న సమయంలో కొన్ని అనూహ్య సంఘటనలు జరుగుతాయి. తన జీవితాన్ని దెబ్బ తీసిన వ్యక్తులపై ప్రతీకారం మొదలుపెడతాడు. ఈ క్రమంలో హీరో చాలామందిని చంపుతాడు. వినాయక్ గారు చాలా స్టైలిష్ గా.. ఎంటర్టైనింగ్ గా ఈ సినిమాను రూపొందించారు’’ అని తేజు వివరించాడు.