Begin typing your search above and press return to search.
సాయిధరమ్ డ్రగ్స్ తీసుకున్నాడనుకుని..
By: Tupaki Desk | 2 Dec 2017 8:06 AM GMTసాయిధరమ్ తేజ్ డ్రగ్స్ తీసుకున్నాడో ఏమో అని వాళ్లమ్మ ఓ సందర్భంలో భయపడిందట. ఈ మధ్య టాలీవుడ్లో డ్రగ్ రాకెట్ బయటపడ్డప్పటి సంగతి కాదు ఇది. కొన్నేళ్ల కిందట.. తేజు అసలు సినీ రంగంలోకే రాకముందు ఆమెకు ఈ సందేహం వచ్చిందట. దాని వెనుక కథాకమామిషు ఏంటో తేజు మాటల్లోనే తెలుసుకుందాం పదండి.
‘‘ఒకప్పుడు నాకు సినిమాల్లోకి రావాలన్న ఆలోచనే లేదు. ఉద్యోగం చేయాలనుకున్నాను. ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగం చేద్దామన్న ఆలోచనలో ఉన్నపుడు నా ఫ్రెండు ఆఫీసుకి రెండు రోజులు వెళ్లాను. అక్కడి వాతావరణం చూశాక 9-5 ఉద్యోగాలు చేయడం మన వల్ల కాదని అర్థమైంది. ఏం చేయాలో తెలియని డైలమాలో పడిపోయాను. ఆ సమయంలోనే నాకు జ్వరం వచ్చింది. రెండ్రోజులు నా గది నుంచి బయటికి రాలేదు. అప్పుడు మా అమ్మ నా అవతారం చూసి భయపడింది. నేను డ్రగ్స్ తీసుకున్నానేమో అని కూడా కంగారుపడింది. ఐతే అప్పుడే నేను ఏదైనా డిఫరెంటుగా చేయాలనుకున్నాను. సినిమాల్లోకి రావాలనుకున్నాను. ఐతే మనకు బ్యాగ్రౌండ్ ఉంది కాబట్టి మనల్ని చూడరని అర్థమైంది. కష్టపడాలని తెలుసుకున్నాను. సినిమాల్లోకి వచ్చాను’’ అని తేజు చెప్పాడు.
తన తొలి సినిమా ‘రేయ్’ షూటింగ్ సవ్యంగా సాగకపోవడం.. ఆ సినిమా పూర్తవడానికి కొన్ని రోజుల ముందే అందులో కీలక పాత్ర చేసిన శ్రీహరి చనిపోవడంతో తనను ఐరెన్ లెగ్ అని.. దురదృష్టవంతుడు అని అన్నారని.. అప్పుడు చాలా బాధపడ్డానని తేజు చెప్పాడు. అదృష్టవశాత్తూ తన కెరీర్ తర్వాత పుంజుకుని హీరోగా నిలబడ్డానని అతనన్నాడు. తాను నటనలోకి రావాలనుకున్నపుడు ముందు పవన్ కళ్యాణ్ మావయ్యకే విషయం చెప్పానని.. ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి.. ఏం చేయాలి అన్న సలహాలు ఆయనే ఇచ్చాడని.. చిరంజీవి మావయ్య తన చదువు విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నాడని తేజు తెలిపాడు.