Begin typing your search above and press return to search.

బుక్కయ్యానంటున్న సాయిధరమ్

By:  Tupaki Desk   |   16 Aug 2017 11:14 AM GMT
బుక్కయ్యానంటున్న సాయిధరమ్
X
పవన్ కళ్యాణ్ కెరీర్ ను మలుపు తిప్పిన ‘తొలిప్రేమ’తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు కరుణాకరన్. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూసి ఫిదా అయిపోయారు ప్రేక్షకులు. ఇప్పుడు చూసుకున్నా ఆ సినిమా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. మంచి ఫీల్ ఇస్తుంది. కానీ తొలి సినిమాతో భారీగా అంచనాలు పెంచిన కరుణాకరన్.. ఆ తర్వాత ఆ అంచనాలకు తగ్గ సినిమా ఒక్కటీ తీయలేకపోయాడు. వాసు.. ఉల్లాసంగా ఉత్సాహంగా లాంటి సినిమాలు కొంచెం పర్వాలేదనిపించాయి కానీ.. మిగతావన్నీ ఫ్లాపులే. కరుణాకరన్ చివరగా తీసిన ‘చిన్నదాన నీకోసం’ కూడా ఫ్లాపే. అయినప్పటికీ సాయిధరమ్ తేజ్ అతడితో పని చేయడానికి ఓకే చెప్పాడు. అసలే వరుస ఫ్లాపులతో స్ట్రగులవుతున్న తేజు.. ఇప్పుడు కరుణాకరన్ తో రిస్క్ చేయడం అవసరమా అంటున్నారు చాలామంది.

ఐతే ఈ ప్రశ్నలకు తేజు సమాధానం చెప్పాడు. ఐతే ఈ సినిమా తాను అంత ఈజీగా ఏమీ ఒప్పుకోలేదని అతనన్నాడు. కరుణాకరన్ తో సినిమా గురించి ఏడాది క్రితమే అనుకున్నానని.. కానీ కథ సెట్టవ్వలేదని.. కథ విషయంలో పూర్తి సంతృప్తి చెందాకే ఈ సినిమా చేస్తున్నానని తేజు చెప్పాడు. కరుణాకరన్ కథకు తనతో రాసి పెట్టి ఉంది కాబట్టే తాను ఈ సినిమా చేస్తున్నానని తేజు అన్నాడు. ఈ సినిమా తానే చేయాలని అందరూ పట్టుబట్టారని.. కాబట్టి ఇలా బుక్కయిపోయానని తేజు చమత్కరించడం విశేషం. తేజు కామెడీ చేయడం ఏమో కానీ.. కరుణాకరన్ తో సినిమా ఎక్కడ తేడా కొడుతుందో.. తేజు ఇంకా డౌన్ అయిపోతాడేమో అన్న ఆందోళన అయితే మెగా అభిమానుల్లో ఉంది. మరి కరుణాకరన్ ఏం చేస్తాడో చూడాలి.