Begin typing your search above and press return to search.

ఆ ఎమ్మెల్యే మాటలపై తేజు కామెంట్స్ విన్నారా?

By:  Tupaki Desk   |   3 Dec 2017 8:19 AM GMT
ఆ ఎమ్మెల్యే మాటలపై తేజు కామెంట్స్ విన్నారా?
X
సినీ పరిశ్రమలోని అమ్మాయిల గురించి ఇటీవల ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో తెలిసిందే. ఇండస్ట్రీలోని హీరోయిన్లకు క్యారెక్టర్ ఉండదని.. వాళ్లు రోజుకొక్కరితో తిరుగుతుంటారని.. ఎప్పటికప్పుడు భర్తల్ని మారుస్తుంటారని రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చాలామంది సినీ తారలు రాజా సింగ్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఐతే ఈ కామెంట్ల మీద మెగా హీరో సాయిధరమ్ తేజ్ మాత్రం తేలిగ్గా స్పందించాడు. ఈ వ్యాఖ్యల విషయంలో తాను హ్యాపీ అని.. తమ ఇండస్ట్రీ గురించి.. తమ జనం గురించి ఏదో ఒకటి మాట్లాడుతున్నారుగా అంటూ.. తేజు చాలా లైట్ గా మాట్లాడాడు. సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతో ఇంటర్వ్యూలో సందర్భంగా తేజు ఈ వ్యాఖ్యలు చేశాడు. దీనిపై తమ్మారెడ్డి కొంచెం తమాషాగానే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఛీ దుర్మార్గుడా.. దుష్టుడా.. నీలాంటి వాళ్లున్న ఇండస్ట్రీ నుంచి నేను నిష్క్రమిస్తున్నా అని ఆయన అన్నారు.

రాజా సింగ్ వ్యాఖ్యల మీద ముందుగా స్పందిస్తూ.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది తమ్మారెడ్డి. ఐతే తేజు తర్వాత సీరియస్ గా మాట్లాడాడు. అతనేదో కాంట్రవర్శీ కోసం మాట్లాడాడని.. అతను మాట్లాడిందానికి విలువ లేదని.. అలాంటపుడు మనమెందుకు మాట్లాడి ఇంకో కాంట్రవర్శీ చేయాలన్నది తన ఉద్దేశమని తేజు అన్నాడు. అద్దాల మేడ మీదికే రాళ్లు ఎక్కువ పడతాయని తన తల్లి చెప్పిందని.. మనం అద్దాలను ఎంత బలంగా బిల్డ్ చేయాలన్నదే ముఖ్యమని తన తల్లి చెప్పిందని.. తాను అదే ఫాలో అవుతానని తేజు స్పష్టం చేశాడు.