Begin typing your search above and press return to search.

బొమ్మాళీ! పవన్ పాటల్నీ వదలా!!

By:  Tupaki Desk   |   9 Feb 2018 12:00 AM IST
బొమ్మాళీ! పవన్ పాటల్నీ వదలా!!
X
టాలీవుడ్ లో మెగాస్టార్ పాటలను రీమిక్స్ చేసుకోవాలంటే చాలానే ఉన్నాయి. ఇతర హీరోలు ఎలాగూ రీమిక్స్ చేసుకోరు కాబట్టి మెగా హీరోలకు ఆ స్వేచ్ఛ చాలానే ఉంటుంది. ఎలాంటి స్టార్ డమ్ లో తేడా రాదు. అయితే మెగాస్టార్ పాటలను ఆయన వారసుడి కంటే మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఎక్కువగా చేస్తున్నాడు. ఇప్పటికే కొన్ని పాటలను రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ మూవీ ఇంటిలిజెంట్ లో కూడా ఓ సాంగ్ చేశాడు.

చమకు చమకు లాంటి మెలోడీ బీట్ ఎంత బావుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీమిక్స్ పరంగా థమన్ ఇచ్చిన అప్డేట్ ట్యూన్స్ బాగానే ఉన్నాయి. కాకపోతే అల్లుడు మాత్రం పాటలో ఆ మ్యాజిక్ ని రీ క్రియేట్ చేయలేకపోయాడని ఓ టాక్ వస్తోంది. చాలా వరకు పాడు చేశాడని కూడా మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ రీమిక్స్ నెక్స్ట్ కూడా సినిమాలను బట్టి చేస్తానని చెప్పిన సాయి పవన్ సినిమాలపై కుడా కన్నేశాడు.

ఒకవేళ చేయాల్సి వస్తే పవన్ సూపర్ హిట్ సాంగ్స్ తొలి ప్రేమ - ఈ మనసే.. జానీ సినిమాలోని నారాజు గాకురా మా అన్నయ్య వంటి పాటలను రీక్రియెట్ చేయాలనీ అనుకుంటున్నాడట మెగా మేనల్లుడు. ఆ స్థాయిలో మ్యాజిక్ చూపిస్తానో లేదో తెలియదు గాని తప్పకుండా చేయడానికి ఇష్టపడుతున్నట్లు తెలిపాడు. అయితే ఇప్పటికే మెగాస్టార్ సాంగ్స్ తో నెగిటివ్ కామెంట్స్ అందుకున్న సాయి పవర్ స్టార్ పాటలను కూడా చెడగొడతాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి.