Begin typing your search above and press return to search.
నిర్మొహమాంటంగా నో చెప్పేస్తా!
By: Tupaki Desk | 11 April 2019 7:56 AM GMTసుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నిజాయితీ, డౌన్ టు ఎర్త్ లక్షణాలు నిరంతరం సినీ వర్గాల్లో హాట్ టాపిక్. ఎంత పెద్ద మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా అతడిలో ఎక్కడా గర్వం అనేది కించిత్ కూడా కనిపించదు. పైగా చాలా సాదా సీదాగా నార్మల్ గయ్ లో పబ్లిక్ కి దర్శనమిస్తుంటాడు. ప్రత్యేకించి డిజైనర్ కాస్ట్యూమ్స్ అంటూ హడావుడి అసలే కనిపించదు. నిన్నటిరోజున చిత్రలహరి ప్రమోషనల్ ఇంటర్వ్యూలకు సాయిధరమ్ చాలా సాదా సీదా యువకుడిలా విచ్చేసి షాక్ నిచ్చాడు. అయితే మరీ ఇది ఎలా సాధ్యం? హరోలంటే అభిమానులకు అంచనాలు ఉంటాయి కదా? అని ప్రశ్నిస్తే.. అభిమానులు చూసేది తెరపై పాత్రను మాత్రమే అని అన్నారు సాయిధరమ్. తెర బయట మామూలుగా ఉండడానికే ఇష్టపడతానని.. ఇదివరకూ ఓసారి పంచె కడితే అది అమ్మకు నచ్చేసిందని - అలానే బయటకు వెళ్లిపోయానని అన్నాడు. నచ్చింది మాత్రమే చేస్తానని సాయిధరమ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
అదొక్కటే కాదు.. వరుస వైఫల్యాలతో ఉన్న విషయాన్ని సాయిధరమ్ ఏమాత్రం మొహమాట పడకుండా వేదికలపైనే చెప్పేస్తున్నాడు. ఇలా చెప్పేస్తే ఫ్యాన్స్ ఫీలవుతారు కదా? అని అంటే .. తనకు ఉన్నది మాట్లాడడమే తెలుసని అన్నారు. ఫెయిలై.. కిందపడి.. లేస్తేనే ఎవరికైనా తర్వాత ఏం చేయాలో తెలుస్తుందని అన్నారు సాయిధరమ్. కొన్నిసార్లు మొహమాటానికి పోయి ఒప్పుకున్నవి... స్క్రిప్టు సగం చేసినవి.. ఫ్రెండ్షిప్ కోసం చేసినవి తనకు ఫ్లాపులుగా మిగిలాయని... తప్పు అని తెలిసీ చేయాల్సొచ్చిందని రియలైజ్ అయ్యానని సాయిధరమ్ తెలిపారు. ఇకపై నిర్మొహమాటంగా నో చెప్పేస్తున్నానని.... స్క్రిప్టు వంద శాతం ఉంటేనే ఓకే చెబుతానని సూటిగా చెప్పేశాడు అతడు.
చిత్రలహరి తర్వాత ఏ సినిమా చేస్తున్నారు? మారుతితో కథ ఫైనల్ అయ్యిందా? అంటే ప్రస్తుతం ఇంకా చర్చల దశలోనే ఉందని, ఏదీ కమిటవ్వలేదని తెలిపాడు. దీంతో పాటే మరిన్ని కథలు వినాల్సి ఉన్నా టైమ్ సరిపోవడం లేదని అన్నాడు. మారుతి చెప్పే స్క్రిప్టుతో పాటు, వేరే కథల్ని వింటానని వెల్లడించాడు సాయిధరమ్. చిత్రలహరి చిత్రంలో విజయ్ పాత్రలో విజయం కోసం వేచి చూస్తున్నాడు. రిజల్ట్ ఈనెల 12న తేలనుంది. ఆ తర్వాత కొత్త ప్రాజెక్టు గురించి చెబుతాడేమో!