Begin typing your search above and press return to search.
మెగాస్టార్ వల్లే మేనల్లుడికి ఈ దుస్థితి!
By: Tupaki Desk | 11 Feb 2018 7:01 AM GMTసాయిధరమ్ తేజ్ అనేవాడు హీరోగా పరిచయమయ్యాడన్నా.. అంతో ఇంతో పేరు.. ఫాలోయింగ్ సంపాదించుకున్నాడన్నా అందుకు మెగాస్టార్ చిరంజీవే కారణం. ఆయన మేనల్లుడు కాబట్టే తేజు సినిమాల్లోకి రాగలిగాడు. ఆయన వల్లే ఇతడికి అవకాశాలు వచ్చాయి. వస్తున్నాయి. మరి తేజు దుస్థితికి ఆయన ఎలా కారణమవుతాడు అన్న ప్రశ్న తలెత్తుతోంది కదా? ఇక్కడే ఉంది మతలబు. తన మావయ్య మీద గౌరవంతో తేజు చేసిన ఒక త్యాగం అతడి కెరీర్ ను ప్రమాదంలో పడేసిన మాట మాత్రం వాస్తవం.
‘పిల్లా నువ్వు లేని జీవితం’.. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’.. ‘సుప్రీమ్’ లాంటి హ్యాట్రిక్ హిట్లతో తేజు స్టార్ ఇమేజ్ దిశగా అడుగులు వేస్తున్న సమయమిది. తేజుతో వరుసగా మూడు సినిమాలు చేసి అతడిని హీరోగా నిలదొక్కుకోవడంలో కీలక పాత్ర పోషించిన దిల్ రాజు.. ‘శతమానం భవతి’లోనూ నటించే అవకాశం ఇచ్చాడు. స్యూర్ షాట్ హిట్టయ్యే అవకాశమున్న కథ అది. శర్వానంద్ స్థానంలో తేజు ఉన్న అది మంచి విజయమే సాధించేదేమో. ఐతే ఆ చిత్రాన్ని 2017 సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకోవడంతో చిక్కొచ్చి పడింది. ఆ పండక్కే చిరంజీవి రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ వస్తుండటంతో తన మావయ్యకు పోటీ వెళ్లడం ఇష్టం లేక అతను ఆ సినిమా వదులుకున్నాడు. తనే శర్వాకు ఫోన్ చేసి ఆ సినిమా చేయమన్నాడు. తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే. ‘శతమానం భవతి’ చేయాల్సిన సమయంలో దాన్ని వదిలేసి.. ‘తిక్క’.. ‘నక్షత్రం’ లాంటి సినిమాలకు డేట్లు ఇచ్చాడు తేజు. అవేమయ్యాయో కొత్తగా చెప్పేదేముంది? వీటిని వదిలేసి ‘శతమానం భవతి’ చేసి ఉంటే ఇప్పుడు తేజు కెరీర్ వేరే రూటు తీసుకుని ఉండొచ్చు. అతను మరీ ఇప్పుడున్న స్థితిలో అయితే ఉండేవాడు కాదేమో.