Begin typing your search above and press return to search.
సుప్రీమ్ హీరో.. ఆ పాట ఎందుకమ్మా?
By: Tupaki Desk | 5 May 2016 10:30 PM GMTఅందం హిందోళం.. అదరం తాంబూళం.. ఇదో మెగా మెగా హిట్ సాంగ్. పాటొచ్చి ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా.. దాని పవర్ మాత్రం తగ్గలేదు. అందుకే సాయిధరమ్ తేజ్ కూడా చాలా ఆవేశంగా ఆ పాటను మిక్సీలో వేసి సానబట్టి.. సుప్రీమ్ సినిమా కోసం వాడుకున్నాడు. అయితే ఈ పాటను వాడుకున్న పద్దతి కాని.. సినిమాలో ప్లేస్ మెంట్ కాని.. తేడాకొట్టేశాయ్.
నిజానికి ఈ పాటలో స్టెప్పుల ఊపు కంటే కూడా.. ఆ ప్యాలెస్ దగ్గర షూట్ చేశారే.. ఆ లొకేషన్ ను చూపించడానికి కష్టపడ్డారు. పైగా ఎక్కువశాతం సాంగ్.. సినిమాటోగ్రాఫర్ షో రీల్ టైపులో ఉంది. సాయిధరమ్ అండ్ రాశి స్టెప్పుల కోసం తెగ ప్రయత్నించారు కాని.. గ్రేస్ మాత్రం మిస్సయ్యింది. అయితే ఇక్కడ అసలు అడగాల్సిన విషయం ఏంటంటే.. ఈ పాటనే ఎందుకు రీమిక్స్ చేసుకున్నారు అని. ఎందుకంటే సినిమాలో కేవలం రాశి ఒక హగ్ ఇవ్వగానే వచ్చేసే పాట కోసం.. ఈ పాటను వాడేశారు. ఇంకేదైనా మంచి సిట్యుయేషన్ లో సాంగ్ వాడుంటే బాగుండేది.
గతంలో చరణ్ చేసిన శుభలేఖ రాసుకున్నా మదిలో ఎపుడో.. లేదంటే సాయిధరమ్ చేసిన గువ్వా గోరింకతో పాటలకు సినిమాలో సిట్యుయేషన్ బాగా కుదిరింది. కాని సుప్రీమ్ లో మాత్రం ఎందుకో అంత సింక్ కాలేదు. మరి ఈ పాటనే ఎందుకు రీమిక్స్ చేశారనేది స్వయంగా మెగా మేనల్లుడే వివరించాలి.