Begin typing your search above and press return to search.

అచ్చం పవన్ నడిచొస్తున్నట్లే ఉందే..

By:  Tupaki Desk   |   4 May 2016 1:00 PM IST
అచ్చం పవన్ నడిచొస్తున్నట్లే ఉందే..
X
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తన మావయ్యల్ని వదిలేలా లేడు. ఇప్పటికే తన తొలి మూడు సినిమాల్లోనూ మావయ్యల్ని పదే పదే గుర్తుకు తెచ్చాడు సాయిధరమ్. ముఖ్యంగా గత సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’లో చిరంజీవిని.. పవన్ కళ్యాణ్ ను ఫుల్లుగా వాడేశాడు. ఆ సినిమాకు రెస్పాన్స్ బాగానే రావడంతో తన తర్వాతి సినిమా ‘సుప్రీమ్’ విషయంలోనూ ఇదే వాడకాన్ని కంటిన్యూ చేస్తున్నట్లున్నాడు. ఆల్రెడీ ‘సుప్రీమ్’ అని పేరు పెట్టుకున్నాడు.. అందం హిందోళం పాటను రీమిక్స్ చేశాడు. ఇలా చిరంజీవిని వాడుకునే విషయంలో ఏమాత్రం తగ్గలేదు.

ఇప్పుడిక పవన్ దగ్గరికి వచ్చాడు సాయిధరమ్. ‘సుప్రీమ్’ రిలీజ్ డేట్ కన్ఫమ్ చేస్తూ రిలీజ్ చేసిన కొత్త పోస్టర్లలో ఒకటి మెగా అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. సడెన్ గా చూస్తే అది ‘గబ్బర్ సింగ్’ పోస్టరేమో అని భ్రమపడే అవకాశముంది. ఆ సినిమాలో పంచెకట్టుతో గాగుల్స్ పెట్టుకుని స్టయిల్ గా పవన్ నమస్కారం చేసే దృశ్యం గుర్తుంది కదా. యాజిటీజ్ అందులో పవన్ ఎలా ఉన్నాడో సాయిధరమ్ కూడా ఈ కొత్త పోస్టర్లో అలాగే ఉన్నాడు.

ఎంతైనా మేనల్లుడు కదా పోలికలు రాకుండా ఎక్కడపోతాయి. పైగా మావయ్యల్ని ఇమిటేట్ చేయడం తేజుకి కొట్టిన పిండే. ఈ పోస్టర్ చూస్తుంటే.. గబ్బర్ సింగ్ పేరడీ ఏదో సినిమాలో ఉండే ఉంటుందని భావిస్తున్నారు. మరి ఆ విశేషమేంటో తెలియాలంటే రేపటి దాకా ఆగాలి.