Begin typing your search above and press return to search.

తేజు తిక్క కాదు.. లెక్క సరిపెట్టాలి

By:  Tupaki Desk   |   5 Aug 2016 3:21 PM GMT
తేజు తిక్క కాదు.. లెక్క సరిపెట్టాలి
X
సాయిధరమ్ తేజ్ ఇప్పుడు తిక్క అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వచ్చేవారం ఈ మూవీ రిలీజ్ కానుండగా.. ఇక ప్రచార హోరులో జోరు పెంచనుంది యూనిట్. ఇప్పటికే మూడు సినిమాలు వరుస హిట్స్ ఇచ్చిన సాయిధరం తేజ్.. ఇప్పుడు మరో హ్యాట్రిక్ శ్రీకారం చుడతాడనే అంచనాలున్నాయి.

ప్రస్తుతం తేజుతో సినిమా అంటే మినిమం 22 కోట్ల మార్కెట్ ఏర్పడిపోయింది. మాస్ లోకి అంతగా చొచ్చుకుపోయిన సాయిధరం తేజ్ కి ఇప్పుడు అసలైన సవాల్ ఎదురుకానుంది. ఇప్పటివరకూ ఈ మెగా హీరో చేసినవన్నీ బడా బ్యానర్లతోనే. దిల్ రాజు.. గీతా ఆర్ట్స్ లాంటి వ్యక్తులు వెనక ఉండడంతో ఈజీగానే హిట్స్ కొట్టాడు. ఇప్పుడు మాత్రం అంతగా డైరెక్టర్ కి క్రేజ్ లేదు.. నిర్మాత కూడా సాధారణమే. పైగా హీరోయిన్ కూడా కొత్తమ్మాయే.

ఇప్పుడు తిక్కతో సత్తా చూపిస్తే.. తేజు రియల్ హీరో అయిపోతాడు. కొత్త బ్యానర్లకు సైన్ చేసేందుకు ధైర్యం ఇచ్చే మూవీ అవాల్సి ఉంటుంది. ఇదంతా జరగాలంటే గత మూడు సినిమాల మాదిరిగానే ఇది కూడా హిట్ అవ్వాలి. అదేమంత ఈజీ విషయం కాదు. ఈసారి ఫ్యామిలీ హీరో వెంకీ నుంచి కాంపిటీషన్ గానే ఉండొచ్చు మరి.!అందుకే ట్రైలర్ లో మాదిరిగా తిక్క సరిపెట్టడమే కాకుండా.. తన కెరీర్ లెక్కను కూడా సరిపెట్టాల్సి ఉంటుంది. !