Begin typing your search above and press return to search.
సాయిధరమ్ ఓకే అంటే సునీల్ డైరెక్షన్!
By: Tupaki Desk | 13 March 2019 7:37 AM GMTసాయిధరమ్ తేజ్ - సునీల్ మధ్య అనుబంధం గురించి ఓ ఆసక్తికర సంగతి తెలిసింది. సునీల్ తో తన అనుబంధం గురించి సుప్రీం హీరో సాయిధరమ్ స్వయంగా రివీల్ చేశారు. చిత్రలహరి టీజర్ వేడుకలో మాట్లాడిన సాయిధరమ్ ..``నువ్వు నేను సినిమా చూసినప్పుడు సునీల్ అన్న కామిక్ టైమింగ్ ని ఎంతో ఇష్టపడ్డాను. నేను నటుడిని అయ్యాక.. సునీల్ తో ఒక్క సినిమా అయినా చేయాలని అనుకున్నా. ఇంతకాలానికి అన్నతో కలిసి నటించే అవకాశం వచ్చింది`` అని అన్నారు. ఇక ఇటీవల తన ఫెయిల్యూర్స్ గురించి ముచ్చటించిన సాయిధరమ్ తన అభిమానుల్ని ఉద్ధేశించి కాస్తంత నిర్వేదంగానే స్పందించారు. వరుసగా సినిమాలొస్తున్నాయి.. ఫెయిలవుతున్నాయి. గత కొంతకాలంగా నిరాశపడుతూనే ఉన్నాను. ఇంకా నేను సర్వైవ్ అవుతున్నానంటే అభిమానుల వల్లనే.. అని సాయిధరమ్ కాస్త ఎమోషనల్ గానే స్పందించారు. మెగా ఫ్యాన్స్ అందరికీ థాంక్స్ చెప్పారు. చిత్రలహరి షూటింగ్ లో చాలా బాగా ఎంజాయ్ చేశాం. నివేద - కళ్యాణి అద్భుతమైన టైమింగ్ తో నటించారని - సునీల్ అన్నతో చేసిన సీన్స్ హైలైట్ గా నిలుస్తాయని అన్నారు.
ఇక ఇదే వేదికపై సాయిధరమ్ తో తన అనుబంధం గురించి సునీల్ గుర్తు చేసుకున్నారు. సాయిధరమ్ తో నా అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. తను ఓకే అంటే నేనే డైరెక్షన్ చేసేస్తాను తమ్ముడూ అని తనతో అనేవాడిని... అని సునీల్ తెలిపారు. చిత్రలహరి గురించి మాట్లాడుతూ..ఇదో ఫీల్ గుడ్ లవ్ స్టోరి. చాలా కొత్త కథతో వస్తున్న చిత్రమిది.. అని తెలిపారు. ఎవరికైనా కొత్తగా ఐడియా వస్తే మైత్రి మూవీ మేకర్స్ దగ్గరకు వెళ్లిపోవచ్చు. వాళ్లు కొత్త సినిమాల్ని ప్రోత్సహిస్తారు అని మైత్రి సంస్థ స్వభావం గురించి వివరించారు. నిర్మాతలు నవీన్ .. రవి - మోహన్ ఎంతో ప్యాషన్ తో తీస్తున్నారని తెలిపారు. టీజర్ పై ముచ్చటిస్తూ.. ఈ టీజర్ అంచనాలకు మించి ఉంది. సినిమాలో డైలాగ్స్ అంతే ఆకట్టుకుంటాయి. టీజర్ లో డైలాగ్ వెటకారం ఆకట్టుకుంది. కిషోర్ తిరుమలలో బోలెడంత వెటకారం ఉంది. అయితే సినిమాలో అదేదీ చూపించడు. ఇకనుంచి ప్రతిదాంట్లో కిషోర్ ఆ వెటకారాన్ని ఉపయోగించాలని కోరుతున్నా. భీమవరంలో నేను కాలేజ్ కి వెళుతూ ఎలా ఉండేవాడినో అలా చూపించారు ఈ చిత్రంలో అని అన్నారు.
సునీల్ తనకు ఉన్న అరుదైన అలవాటు గురించి ఈ సందర్భంగా ప్రస్థావించారు. ``పొద్దున్నే కాలేజ్ టైమ్ లో మోర్నింగ్ షో.. మధ్యాహ్నం క్లాసుల టైమ్ లో మ్యాట్నీ.. సాయంత్రం ప్రయివేటు టైమ్ లో ఇంగ్లీష్ సినిమా చూసేసేవాడిని. శుక్రవారం వస్తే చిత్రలహరి ప్రోగ్రామ్ వచ్చేది. పగలు `కాశ్మీరు లోయలో...` అంటూ మెగాస్టార్ చిరంజీవి గారి పాట చూసి.. మళ్లీ రాత్రి `చిత్రలహరి`లో అదే పాటను చూసేవాడిని . పాతికేళ్ల తర్వాత చిత్రలహరిలో నటిస్తానని నేను అనుకోలేదు... అని సునీల్ పాత జ్ఞాపకాల్ని అందరితో పంచుకున్నారు.