Begin typing your search above and press return to search.
మెగా మేనల్లుడి మాట నిజమైంది
By: Tupaki Desk | 17 Jan 2017 7:11 AM GMT‘ఖైదీ నెంబర్ 150’ విడుదలకు ముందు రోజు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్.. ఒక వ్యాఖ్య చేశాడు. ఇన్నాళ్లూ ‘నాన్ బాహుబలి’ రికార్డులని చెప్పుకునేవాళ్లమని.. కానీ ఇకపై ‘నాన్ ఖైదీ నెంబర్ 150’ రికార్డులని చెప్పుకునే రోజులు రాబోతున్నాయని అన్నాడు సాయిధరమ్. అప్పుడా కామెంట్ చూసి సాయిధరమ్ మరీ టూమచ్ గా ఆశలు పెట్టుకుంటున్నాడని కొందరికి అనిపించి ఉంటే ఆశ్చర్యమేమీ లేదు. కానీ ఇప్పుడు సాయిధరమ్ మాట కొంత వరకు నిజమైంది. ఫస్ట్ వీక్ వసూళ్లలో ‘ఖైదీ నెంబర్ 150’ చాలా చోట్ల బాహుబలి రికార్డుల్ని దాటేయడం విశేషం.
కృష్ణా జిల్లాలో తొలి వారం ‘బాహుబలి’ రూ.3.63 కోట్ల షేర్ సాధిస్తే.. ‘ఖైదీ నెంబర్ 150’ ఆ రోజుకే 3.77 కోట్లు కొల్లగొట్టింది. ఇక పశ్చిమ గోదావరిలో బాహుబలి తొలి వారంలో రూ.4.48 కోట్ల షేర్ రాబడితే.. చిరు సినిమా ఒక రోజు ముందే రూ.4.55 కోట్లు వసూలు చేసింది. తూర్పు గోదావరిలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఆ రోజుల్లో అక్కడ ‘150’ రూ.5.92 కోట్లు వసూలు చేసింది. నెల్లూరు జిల్లాలో ఆరో రోజుకు రూ.2.25 కోట్లు వసూలయ్యాయి. ఈ రెండు జిల్లాల్లోనూ బాహుబలి తొలి వారం వసూళ్లను ‘ఖైదీ నెంబర్ 150’ దాటేసింది. వైజాగ్ లో సైతం బాహుబలి తొలి వారం వసూళ్ల కంటే ‘ఖైదీ నెంబర్ 150’వే ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ఏరియాల్లో ఫుల్ రన్ వసూళ్లలో కూడా ‘బాహుబలి’ని చిరు సినిమా దాటేస్తే ఆశ్చర్యమేమీ లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/