Begin typing your search above and press return to search.
ఈ లవ్ సరిపోదు తేజు
By: Tupaki Desk | 2 July 2018 7:44 AM GMTసుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా తేజ్ ఐ లవ్ యుకు కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే ఉన్నా ఆ సందడి అంతగా కనిపించడం లేదు. నిన్న భీమవరంలో చేసిన ప్రీ రిలీజ్ కు హాజరు భారీగా కనిపించినా దాన్ని బట్టి బజ్ భీభత్సంగా ఉంది అనుకోవడానికి లేదు. ఆర్ ఎక్స్ 100 అనే చిన్న సినిమా యూనిట్ కు ఇంత కంటే ఎక్కువ రెస్పాన్స్ టీమ్ టూర్ కు వెళ్ళినప్పుడు దక్కుతోంది. కాబట్టి భీమవరం తేజ్ ఐ లవ్ యు వేడుకలో జనం కనిపించారు కాబట్టి ఓపెనింగ్స్ అదిరిపోతాయి అనుకుంటే సాంబార్ లో కాలేసినట్టే. నిజానికి సాయి ధరమ్ తేజ్ ఈ మూవీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నా ప్రమోషన్స్ విషయంలో మాత్రం అంత హుషారుగా కనిపించడం లేదు. ఫార్మల్ గా చేస్తున్న వాటికి అటెండ్ అవుతున్నాడు కానీ మునుపటి జోష్ మిస్ అవుతోంది. కనీసం ఇంటెలిజెంట్ టైం లో చూపించిన ఉత్సాహం కూడా తేజులో కనిపించడం లేదు.
ఇప్పుడు తేజ్ ఐ లవ్ యుకి ఈ వీక్ ప్రమోషన్స్ మైనస్ గా మారుతున్నాయి. టైటిల్ లో ఐ లవ్ యు ఉంది కదా అని యూత్ అందరు మొదటి రోజే ఎగబడిపోరు. తేజు ఫాన్స్ ని మినహాయిస్తే టాక్ ఎలా ఉందొ తెలిసాక గాని జనం కదల్లేని పరిస్థితి. ఆల్రెడీ ఐదు డిజాస్టర్లతో తన ఉనికినే ఇబ్బందుల్లో పడేసుకున్న తేజుకు ఇది లైఫ్ అండ్ డెత్ గేమ్. కానీ మీడియాతో మాట్లాడేందుకు కూడా అంతగా చొరవ చూపడం లేదు తేజు. నిర్మాత కెఎస్ రామారావు పదే పదే చిరంజీవి కార్డు వాడుకుని సినిమా గురించి చెబుతున్నా మెగా ఫాన్స్ కు సైతం ఇది ఏమంత కిక్ ఇవ్వడం లేదు. ముందు రానివ్వండి అప్పుడు చూద్దాం అనే ధోరణి కనిపిస్తోంది. ఒకవేళ తేజు ఆశలు వదిలేసుకొని ఇలా ప్రవర్తిస్తున్నాడా లేక ఈసారి తన కంటే తన సినిమా మాట్లాడాలి అని డిసైడ్ అయిపోయి ప్లాన్డ్ గా ఉన్నాడా అనేది జులై 6న తేలనుంది. తన లాగే బ్యాడ్ టైం లో ఉన్న గోపిచంద్ నటించిన పంతంతో ఒక్క రోజు గ్యాప్ లో పోటీ పడుతున్న తేజ్ ఐ లవ్ యు విషయంలో ఏ మాత్రం చిన్న తేడా జరిగినా ఇప్పుడనుకున్న భయాలకు రెక్కలు వచ్చి ఫలితంలో తేడా వస్తుంది. మరి తేజు కోరుకుంటున్న సక్సెస్ ఐ లవ్ యు ఇవ్వడం లేదా. ఏమో 6దాకా వేచి చూద్దాం.