Begin typing your search above and press return to search.

తిక్కలో ఆ తిక్కకు ఫుల్‌ స్టాప్‌

By:  Tupaki Desk   |   10 May 2016 11:00 PM IST
తిక్కలో ఆ తిక్కకు ఫుల్‌ స్టాప్‌
X
మెగాస్టార్ మేనల్లుడు సాయిధరం తేజ్.. వరుసగా హిట్స్ కొడుతూ దూసుకుపోతున్నాడు. సుబ్రమణ్యం ఫర్ సేల్ - సుప్రీం చిత్రాలతో బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా చూపించిన ఈ మెగా హీరో.. ఓ విషయంలో మాత్రం బాగా హర్ట్ అయ్యాడు. తన ప్రతీ మూవీలో ఓ చిరంజీవి పాటను రీమిక్స్ చేసేయడం బాగా అలవాటుగా పెట్టుకున్న తేజుకి.. ఇదే బోలెడన్ని విమర్శలు రావడానికి కారణమైంది.

మెగాస్టార్ - పవర్ స్టార్ లను అవసరానికి మించి వాడేస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఇంట్లో నుంచి పెద్దగా అభ్యంతరాలు రాకపోయినా, ఇండస్ట్రీ జనాలతోపాటు ఆఢియన్స్ నుంచి మాత్రం విమర్శలు వస్తున్నాయి. దీంతో ఇక మెగాస్టార్ సాంగ్స్ ను రీమిక్స్ చేసే ట్రెండ్ కు దూరంగా వుండాలనుకున్నాడు సాయిధరం తేజ్. ప్రస్తుతం ఈ కుర్రాడు చేస్తున్న తిక్క సినిమాలో ఓ రీమిక్స్ పెట్టాలన్నది దర్శక నిర్మాతల ఆలోచన. అయితే.. ఇప్పటికే తనపై వస్తున్న విమర్శలను సీరియస్ గా తీసుకున్న సాయిధరం తేజ్.. తిక్కలో మాత్రం రీమిక్స్ ఉండొద్దని డిసైడ్ అయ్యాడట.

స్టోరీ ప్రకారం అవసరం అయితే తప్ప... ఇకపై తన సినిమాల్లో రీమిక్స్ కు చోటివ్వకూడాదని నిర్ణయించుకున్నాడట తేజు. ఓ రకంగా ఇది మంచి పనే అని కొందరు అంటుంటే.. ఇన్ స్టంట్ గా ఫ్యాన్స్ ని కనెక్ట్ అవడం కొంచెం ఇబ్బందిగా మారచ్చని చెబుతున్నారు మరికొందరు.