Begin typing your search above and press return to search.
మెగా హీరోకు మంచు విష్ణు ఫన్నీ వార్నింగ్..తేజూ రిప్లె అదిరింది
By: Tupaki Desk | 8 Feb 2020 10:37 AM GMTమెగా హీరో సాయి ధరమ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ చిత్రలహరి మరియు ప్రతిరోజు పండుగే చిత్రాలతో సక్సెస్ లను దక్కించుకుని మరో విజయాన్ని సొంతం చేసుకునేందుకు సుబ్బు దర్శకత్వంలో సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రం ప్రమోషన్ ను తేజూ చాలా విభిన్నంగా చేస్తున్నాడు. సింగిల్ గా లైఫ్ ను లీడ్ చేస్తున్న వారికి తాను ఒక నాయకుడిని అనే అర్థం వచ్చేలా అతడు ప్రమోషన్స్ జోరు చూపిస్తున్నాడు. ప్రేమికుల రోజు సందర్బంగా సింగిల్స్ పవర్ ఏంటో చూపించబోతున్నట్లుగా ప్రకటించిన తేజూ తాజాగా మరోసారి సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.
ఆ పోస్ట్ లో సింగిల్ అయినందున నేను నా ఫోన్ లో చార్జింగ్ లేకున్నా కూడా టెన్షన్ పడను. రెస్టారెంట్ కు వెళ్లిన సమయంలో నేను మాత్రమే తిన్న ఫుడ్ కు బిల్లు చెల్లిస్తాను. క్రికెట్ ఆడేప్పుడు మద్యలో కాల్ వచ్చిందని వెళ్లి పోను. షూట్.. క్రికెట్.. జిమ్.. ఇంట్లో నాకు నచ్చిన టైంకు నచ్చిన వారితో ఉంటాను. నాకు నచ్చినట్లుగా టైం స్పెండ్ చేయగలను. మరి మీరు ఇలా చేయగలరా అంటూ ప్రశ్నించాడు. కేవలం సింగిల్స్ మాత్రమే ఇలా లైఫ్ ను ఎంజాయ్ చేస్తారని తేజూ అన్నాడు.
తేజూ పోస్ట్ కు మంచు విష్ణు ఫన్నీగా స్పందించాడు. తమ్ముడు.. నా చిట్టి తమ్ముడు తేజూ ఈ ట్వీట్ ను నేను సేవ్ చేసుకుంటున్నాను. ఇంకా ఎన్ని రోజులు సోలోగా ఉంటావో చూస్తానుగా అంటూ సోలో బ్రతుకే సో బెటర్ చిత్రానికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.
మంచు విష్ణు ఇచ్చిన స్వీట్ వార్నింగ్ కు తేజూ స్పందిస్తూ.. విష్ణు అన్న అందరు మీ అంత లక్కీ కాదు కదన్న అంటూ ట్వీట్ చేశాడు.
వీరిద్దకి ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సింగిల్స్ కోసం అంటూ తేజూ ఈ చిత్రంను తెగ ప్రచారం చేస్తున్నాడు. మరి ఈ చిత్రం క్లైమాక్స్ లో కూడా తేజూ సింగిల్ గానే ఉంటాడా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయం తెలియాలి అంటే సినిమా మే 1న విడుదల కాబోతుంది అప్పటి వరకు వెయిట్ చేయాలి.