Begin typing your search above and press return to search.
గాంధీ జయంతికి సాయితేజ్ `రిపబ్లిక్` డేట్ ఫిక్స్
By: Tupaki Desk | 15 Aug 2021 2:30 PM GMTమెగా హీరో సాయి తేజ్ నటించిన సీరియస్ ఎమోషనల్ సోషల్ డ్రామా `రిపబ్లిక్`. తేజ్ కెరీర్ కి ఒక ప్రస్థానం లాంటి సినిమా అంటూ ప్రచారమవుతోంది. ఇన్నాళ్లు రిలీజ్ తేదీపై సందిగ్ధత నెలకొంది. ఇకపై థియేటర్లు తెరవడంతో రిలీజ్ బాట పట్టింది టీమ్. ఎట్టకేలకు విడుదల తేదీని ఖరారు చేసారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1 న రిపబ్లిక్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
రిపబ్లిక్ లో సాయి తేజ్ పంజా అభిరామ్ అనే జిల్లా కలెక్టర్ పాత్రను పోషిస్తున్నారు. ఇంతకుముందు రిలీజైన విజువల్స్ ఆద్యంతం సీరియస్ డ్రామాతో ఎమోషనల్ డ్రైవ్ ఉన్న సినిమా ఇదని వెల్లడించాయి. ఈ సినిమాలో జగపతి బాబు- రమ్య కృష్ణ- ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవా కట్టా రిపబ్లిక్ కు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు భగవాన్- పుల్లారావు నిర్మించారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీత స్వరకర్త.
దేవాకట్టాకి కీలక మలుపు ఇదే
దేవాకట్టా పేరు వినగానే ప్రస్థానం సినిమా గుర్తుకు వస్తుంది. వెన్నెల లాంటి క్లాసిక్ రొమాంటిక్ కామెడీని తెరకెక్కించిన దేవాకట్టా ప్రస్థానం లాంటి పొలిటికల్ ఎమోషనల్ థ్రిల్లర్ ని తెరకెక్కించి మెప్పించారు. ఆయనకంటూ ప్రత్యేకించి ఫాలోయింగ్ తెచ్చిన చిత్రాలివి. అయితే ఆ తర్వాత అతడు తీసిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో మెప్పించలేదు.
దేవా కట్టా సినిమాల్లో సీరియస్ నెస్ కొంత ఇబ్బంది అన్న టాక్ కూడా ఉంది. కానీ అతడు మరో ప్రస్థానం రేంజు సినిమా తీస్తాడన్న హోప్ ఎప్పటికీ అభిమానుల్లో ఉంది. అందుకే ఇప్పుడు సాయి తేజ్ లాంటి ఎనర్జిటిక్ యంగ్ హీరోతో దేవాకట్టా రిపబ్లిక్ అనే టైటిల్ తో సినిమా తీస్తున్నారు అనగానే కొంత ఆసక్తి. ఇక అతడు ఈ సినిమాతో కంబ్యాక్ అవుతాడని అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
రిపబ్లిక్ టీజర్ ఇంతకుముందు రిలీజై ఆకట్టుకుంది. అవినీతి సమాజం రాజకీయాలపై సీరియస్ డ్రామా నేపథ్యంలో చిత్రమిది. సంస్థాగత పునాదులు అవినీతిలో మునిగిపోతున్నందున వ్యవస్థ బాంకర్లుగా మారిందని ఉరుములతో కూడిన క్రూసేడర్ పాత్రను ఆవిష్కరించారు. ఈ చిత్రంలో అవినీతి వ్యవస్థపై తిరుగుబాటు చేసే యువ కలెక్టర్ పాత్రలో సాయి తేజ్ కనిపిస్తారు. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కో అరిచే హక్కో అనే భ్రమలో ఉన్నాం.. కానీ కట్టకుండా కూలిపోతున్న వ్యవస్థలే.. ఇంకా ఫ్యూడల్ వ్యవస్థలోనే బతుకుతున్నాం.. అంటూ పవర్ ఫుల్ డైలాగ్ లు వినిపించాయి.
``ఇది ఒక భూస్వామ్య వ్యవస్థ.. ఇక్కడ ప్రజాస్వామ్యం ఓటు వేయడానికి నినాదాలు చేయటానికి పరిమితం చేయబడింది`` అన్నది సినిమా థీమ్ పౌర సేవకులు న్యాయస్థానాలు కూడా భూస్వామ్య ప్రభువుల చెప్పు కింద నలిగిపోతున్నాయని వాదించేవాడిగా సాయితేజ్ కనిపిస్తారు. రమ్య కృష్ణ ఈ చిత్రంలో ఒక శక్తివంతమైన అధిపతి పాత్రలో కనిపించనున్నారు.