Begin typing your search above and press return to search.

అది రెజీనా పర్సనల్.. నో కామెంట్

By:  Tupaki Desk   |   8 Feb 2018 1:34 PM GMT
అది రెజీనా పర్సనల్.. నో కామెంట్
X

టాలీవుడ్ లో ప్రతి హీరో హీరోయిన్ ఎప్పుడో ఒకప్పుడు లవ్ రూమర్స్ ని ఫెస్ చేయాల్సి ఉంటుందని ఈ రోజుల్లో చాలా ఉదాహరణలు నిలుస్తున్నాయి. సీక్రెట్ గా రిలేషన్ ని మెయింటేన్ చేద్దామనుకుంటే ఎక్కడ ఏ కెమరా వచ్చి ఫ్లాష్ దెబ్బ కొడుతుందో అని భయం చాలానే ఉంటుంది. అందుకే చాలా మంది హీరోయిన్స్ షూటింగ్స్ లో భాగంగా ప్రేమ యాత్రలను కొనసాగిస్తారని ఒక టాక్ బాగా వినిపిస్తుంటుంది.

ఇక అసలు విషయానికి వస్తే ఆ మధ్య సౌత్ హీరోయిన్ రెజీనాకు అలాగే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మధ్య ప్రేమాయణం బాగానే కొనసాగిందని చాలా వార్తలు వచ్చాయి. ఇద్దరు మూడు సినిమాల్లో నటించేటప్పటికీ రూమర్స్ కి ఎనర్జీ పెరిగిపోయి పరిస్థితి సీరియస్ అయ్యే వరకు వచ్చింది. దీంతో ఈ విషయంపై ఇద్దరు తారలు స్పందించి రూమర్స్ కి చెక్ పెట్టె ప్రయత్నం చేశారు. కానీ ఏ మాత్రం లాభం లేకపోయింది.

అలాగే ఆ మధ్య రెజీనా తాను ప్రేమలో మోసపోయనని అది కెరీర్ పై కూడా ప్రభావం చూపించిందని వివరణ ఇవ్వడంతో ఇంకా టాపిక్ హాట్ గా మారింది. ఇక ఆ విషయానికి సంబందించిన ప్రశ్న రీసెంట్ గా సాయి ధరమ్ కి ఎదురవ్వడంతో సైలెంట్ గా సమాధానం ఇచ్చి తప్పించుకున్నాడు అనే టాక్ వస్తోంది. అది ఆమె పర్సనల్ విషయం. దాని గురించి నేనేలా స్పందిస్తాను. అది కరెక్ట్ కాదు కూడా అని సాయి సమాధానం ఇచ్చాడు.