Begin typing your search above and press return to search.

చెల్లితో పెళ్లి ఏంటీ? మెగాహీరో షాకింగ్‌ ఆన్సర్‌

By:  Tupaki Desk   |   26 April 2019 12:35 PM GMT
చెల్లితో పెళ్లి ఏంటీ? మెగాహీరో షాకింగ్‌ ఆన్సర్‌
X
మెగాస్టార్‌ మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన సాయి ధరమ్‌ తేజ్‌ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్‌ డంను - ఇమేజ్‌ ను ఏర్పర్చుకునేందుకు చాలా కష్టపడుతున్నాడు. మెల్ల మెల్లగా మెగా నీడ నుండి బయట పడుతూ వస్తున్న సాయి ధరమ్‌ తేజ్‌ తాజాగా 'చిత్రలహరి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి ముందు తేజ్‌ నటించిన ఆరు సినిమాలు వరుసగా ఫ్లాప్‌ అయ్యాయి. ఆరు ఫ్లాప్‌ ల తర్వాత వచ్చిన సక్సెస్‌ అవ్వడంతో చిత్రలహరి విజయంను తేజ్‌ బాగా ఎంజాయ్‌ చేస్తున్నట్లుగా ఉన్నాడు. ఇక తేజ్‌ పెళ్లి గురించి మీడియాలో ఎప్పుడు ఏదో ఒక వార్త ఉంటూనే ఉంది. ముఖ్యంగా నాగబాబు కూతురు నిహారిక తేజ్‌ కు వరుసకు మరదలు అవుతుంది. అందువల్ల నిహారికను తేజ్‌ చేసుకుంటాడంటూ ప్రచారం జరుగుతుంది.

నిహారికతో పెళ్లి విషయంలో పదే పదే సాయి ధరమ్‌ తేజ్‌ కొట్టి పారేశాడు. అయినా కూడా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నిహారికతో పెళ్లి వార్తల గురించి తేజ్‌ స్పందిస్తూ... ఈ వార్తలు నా సహనాన్ని పరీక్షిస్తున్నాయి. నిహారికతో పెళ్లి అంటూ వస్తున్న వార్తల వల్ల నాకు వ్యక్తిగతంగా చాలా బాధ అనిపిస్తుంది. ఈ రూమర్లు విని విని విసుగు వచ్చింది. మా ఫ్యామిలీలో అంతా కూడా అన్నా చెల్లి తరహాలో పెరిగాం. అలాంటప్పుడు నిహారికను నేను చెల్లిగా భావిస్తాను. చెల్లిని పెళ్లి చేసుకుంటావా అని ఎవరైనా అడిగితే కాలుతుంది కదా, నాకు కూడా అలా ఎవరైనా అడిగితే కాలుతుందని తేజ్‌ షాకింగ్‌ ఆన్సర్‌ ఇచ్చాడు. తేజ్‌ ఇచ్చిన ఈ ఆన్సర్‌ తో మళ్లీ ఇద్దరి పెళ్లి గురించిన వార్తలు రాకపోవచ్చు.

చాలా కాలం తర్వాత చిత్రలహరి చిత్రంతో సక్సెస్‌ ను దక్కించుకున్న సాయి ధరమ్‌ తేజ్‌ తర్వాత సినిమా మారుది దర్శకత్వంలో ఉండే అవకాశం ఉంది. వీరిద్దరి కాంబోలో సినిమా ఇప్పటికే రావాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.