Begin typing your search above and press return to search.
అమ్మాయిల కాంటాక్ట్స్ పై మేనల్లుడి బాధ
By: Tupaki Desk | 1 May 2016 7:30 AM GMTమెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో మేనల్లుడు కమ్ సాయి ధరం తేజ్ కు స్పెషల్ గుర్తింపు ఉంది. ఇతగాడిపై వచ్చినన్ని రూమర్స్ ఏ మెగా హీరో పైనా వినిపించలేదు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో తేజుపై బోలెడన్ని కబుర్లు వినిపిస్తున్నాయి. ఆ హీరోయిన్ తో ప్రేమ, ఈ హీరోయిన్ తో ఎఫైర్ అంటూ తెగ గాసిప్స్ వినిపిస్తూ ఉంటాయి. ఇప్పటివరకూ ఇలాంటి రూమర్లపై తేజు స్పందిచలేదు కానీ.. తొలిసారిగా తెగ బాధ పడిపోతూ మాట్లాడాడు.
రొమాంటిక్ హీరో అనిపించుకోవడం ఇష్టమే అయినా.. ఇలాంటి రూమర్స్ మాత్రం ఇబ్బందిగానే ఉన్నాయంటున్నాడు తేజు. సుప్రీమ్ మూవీలో రాశి ఖన్నాకు, తనకు రొమాంటిక్ సీన్స్ ఉంటాయని.. అలాగని ఎఫైర్ ఉందంటే ఎలా క్వశ్చన్ చేస్తున్నాడు. ఇప్పటికే తనపై చాలా రూమర్స్ ఉన్నాయన్న తేజు.. తనకు తెలీకుండానే తన పెళ్లి కూడా చేసేశారంటూ ఆశ్చరపోయాడు.
'మొదట ఇలాంటి వార్తలను పట్టించుకునేవాడిని. తర్వాత అలావాటైపోయింది. కానీ గతంలో నాకు నచ్చిన అమ్మాయిలు ఇప్పుడిప్పుడే కాంటాక్ట్ లోకి వస్తున్నారు. కానీ ఇలాంటి రూమర్ల కారణంగా..ఆ కాంటాక్ట్స్ కూడా పోతున్నాయి' అంటూ నవ్వేశాడు సాయి ధరం తేజ్.