Begin typing your search above and press return to search.
రకుల్.. రెజీనాలను అలా చూడలేడట
By: Tupaki Desk | 19 Feb 2017 12:58 PM GMTతనకు ఫ్రెండ్స్ అయిన హీరోయిన్లతో రొమాన్స్ చేయడం చాలా కష్టమైపోతోందని అంటున్నాడు సాయిధరమ్ తేజ్. ఆ లిస్టులో ప్రధానంగా రకుల్ ప్రీత్ సింగ్.. రెజీనా ఉంటారని.. వాళ్లతో రొమాన్స్ చేయడానికి తన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావని అన్నాడు తేజు.
‘‘హీరోయిన్ల గ్లామర్ గురించి అడిగితే.. అమీ జాక్సన్ గురించి ఎంతైనా మాట్లాడతా. కానీ రకుల్.. రెజీనా లాంటి వాళ్ల అందం గురించి వర్ణించమంటే నాకు కష్టం. వాళ్లిద్దరూ నాకు క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్లను నేను అందం కోణంలో చూడలేను. వాళ్ల అందాన్ని వర్ణించలేను. వీళ్లతో రొమాంటిక్ సీన్స్ చేయడం కష్టం. రకుల్.. నేను బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటాను. నువ్వు అని ఏకవచనంతో పిలుచుకుంటాం. ‘విన్నర్’ మూవీలో రకుల్ తో రొమాంటిక్ సీన్స్ చేస్తున్నపుడు ఇద్దరికీ ఇబ్బంది అయింది. రకుల్ ను చూసి.. అలా చేయొద్దు అనేవాడిని. కానీ మనకు డబ్బులిస్తున్నారు కాబట్టి మనం చేయాల్సిందే అని సర్దుకుని రొమాంటిక్ సీన్ పూర్తి చేసేవాళ్లం’’ అని సాయిధరమ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
రకుల్ తో తనకు ఎఫైర్ ఉందని వార్తలు రావడంపై తేజు స్పందిస్తూ.. ‘‘మా గురించి మీడియాలో భలే స్క్రీన్ ప్లే రాశారు. ఓసారి విన్నర్ డైరెక్టర్ గోపీచంద్ గారు రకుల్ పర్సు ఓపెన్ చేస్తే అందులో నా ఫొటో కనిపించినట్లు రాశారు. ఆ స్క్రీన్ ప్లే నాకు అర్థం కాలేదు. అయినా ఈ కాలంలో పర్సుల్లో ఎవరు ఫొటోలు పెట్టుకుంటారు. ఎంచక్కా ఫోన్ లో ఫొటో చూసుకుంటారు కానీ. ఈ కహానీ చదవి.. ఏ కాలంలో ఉన్నార్రా బాబూ.. ఆ జమానా ఎప్పుడో అయిపోయింది.. అనుకుని ఇద్దరం నవ్వుకున్నాం’’ అన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/