Begin typing your search above and press return to search.
తేజుకు మెగా గెడ్డం సెంటిమెంట్
By: Tupaki Desk | 19 March 2019 9:54 AM GMTమెగా కాంపౌండ్ కి గెడ్డంకి అవినాభావ సంబంధం ఉంది. దానికీ సక్సెస్ కి లింక్ కూడా ఉంది. ఎలా అంటారా. మీరే చూడండి. చిరంజీవి కెరీర్ లో మొదటిసారి సినిమా మొత్తం సహజమైన పూర్తి గెడ్డంతో నటించిన సినిమా గ్యాంగ్ లీడర్. అది ఎంత పెద్ద చరిత్ర సృష్టించిందో అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆయన వారసుడు రామ్ చరణ్ పది సినిమాల తర్వాత రంగస్థలంలో గుబురు గెడ్డంతో కనిపిస్తే నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డులు సొంతమయ్యాయి.
వరుణ్ తేజ్ సినిమా మొత్తం కాకపోయినా తొలిప్రేమ సెకండ్ హాఫ్ లో ట్రై చేసిన ఈ లుక్ సక్సెస్ కు దోహదపడింది. మంచి ప్రశంశలు దక్కాయి. నాగబాబు తొలి రెండు సినిమాల్లో చేసినవి సపోర్టింగ్ రోల్స్ అయినప్పటికీ వాటిలో కగెడ్డంతోనే ఉంటాడు. రాక్షసుడు-మరణమృదంగం రెండు కమర్షియల్ సక్సెస్ సాధించాయి. ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రం ఇంత రఫ్ లుక్ ని ఎప్పుడూ ట్రై చేయలేదు. మొదటి సినిమా గంగోత్రిలో క్లీన్ షేవ్ తో కనిపించిన అల్లు అర్జున్ ఆర్యలో గెడ్డంతోనే మొదటి హిట్టు కొట్టాడు.
ఇక ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ వంతు వచ్చింది. చిత్రలహరి కోసం ఫుల్ గా గెడ్డం పెంచి కొత్త మేకోవర్ తో కనిపిస్తున్నాడు. టీజర్ లో లుక్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇప్పుడు ఈ సెంటిమెంట్ తేజుకు కూడా వర్క్ అవుట్ అవుతుందనే అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఈ సుప్రీమ్ హీరో కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంతో పాటు తిరుమల కిషోర్ టేకింగ్ మీద ఇన్ సైడ్ రిపోర్ట్స్ పాజిటివ్ గానే ఉన్నాయి. ఇప్పుడీ చిత్రలహరి కూడా హిట్టు కొడితే మెగా గెడ్డం సెంటిమెంట్ మరింత బలపడినట్టే. ఎన్నికల సందడిలో పోలింగ్ ముగిసిన మరుసటి రోజు ఏప్రిల్ 12న విడుదల కానున్న చిత్రలహరికి పెద్దగా పోటీ భయం కూడా లేదు.